మహిళా సర్పంచ్‌లకు సన్మానం

8 Mar, 2019 09:06 IST|Sakshi
మహిళా ప్రజాప్రతినిధులను సన్మానించిన ఎమ్మెల్యే (ఫైల్‌ ఫొటో)

సాక్షి, మునిపల్లి(అందోల్‌): నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఉంది. ఈ సందర్భంలో మహిళల ప్రాధాన్యతను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహిళలు అన్నిరంగాల్లో రాణించేందుకు మగవారితో పోటీ రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. నేడు మహిళలు అన్ని రంగాలలో ముందుంటున్నారు. కానీ మండలంలో తాము రాజకీయంగా మాత్రం రాణించలేకపోతున్నామని కొందరు మహిళల్లో ఆందోళన వ్యక్తమవడంతో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఇటీవల జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ను ఆయా గ్రామాల సర్పంచ్‌లు కోరారు.

మగవారికన్నా మహిళలే అన్ని రంగాల్లో ముందుంటున్నారని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ ఈ నెల 2వ తేదీన మునిపల్లి మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. ఈ నేపథ్యంలో మునిపల్లి మండలంలో 12 మంది ఎంపీటీసీ స్థానాలుండగా వాటిలో ఆరుగురు మహిళలకు రిజర్వేషన్లను ఖరారయ్యాయి. 30 మంది సర్పంచ్‌లకు గాను 18 మంది మహిళా సర్పంచ్‌లు ఉన్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ సందర్భంగా కొత్తగా సర్పంచ్‌లుగా ఎన్నికైన ఆయా గ్రామాల మహిళా ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రజాప్రతినిధులుగా ఎంపికైన వారే సక్రమంగా అన్ని పనులు నిర్వహించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మహిళలందరూ స్వతంత్రంగా వారే నిర్ణయాలు తీసుకునేవిధంగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు. ప్రభుత్వ కార్యక్రమంలో కూడా మహిళా ప్రజాప్రతినిధులే పాల్గొనాలని, వారి భర్తలు పాల్గొనకుండా చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు. మహిళలు వంటింటికే పరిమితమన్న మాట మర్చిపోయి మగవారితో సమానంగా రాజకీయాలలో అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని మహిళా ప్రజాప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 

మహిళలకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ, స్వాతంత్రం ఉన్నప్పటికీ రాజకీయాలలో రాకుండా అడ్డుకునేందుకు కుట్రలు, కుతంత్రాలు జరుగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. మహిళా దినోత్సవాలను జరుపుకోవడం అనవాయితీగా వస్తోంది. కానీ ప్రజాప్రతినిధులుగా మహిళలు ఎన్నికైనప్పటికీ  పూర్తి స్థాయిలో అధికారం చేయలేకపోతున్నామని వాపోతున్న సంఘటనలున్నాయి. మహిళలకు 65 శాతం రిజర్వేషన్‌ కల్పించాల్సిన అవసరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. అదేవిధంగా మహిళా ప్రజాప్రతినిధుల హక్కులు, విధులను మహిళలే నిర్వహించుకునే విధంగా చూడాల్సిన అవసరం కేంద్ర, రాష్త్ర్‌ట ప్రభుత్వాలపై ఉందని మహిళా ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

ఎంపీపీ ఈశ్వరమ్మ  

మరిన్ని వార్తలు