రైతన్న కన్నెర్ర

20 Feb, 2018 16:32 IST|Sakshi
వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఎదుట ధర్నా చేస్తున్న రైతులు 

మార్కెట్‌ యార్డు ఎదుట 3 గంటల పాటు ధర్నా

నిలిచిపోయిన రాకపోకలు..

జతకలిసిన అఖిలపక్షం

రైతుల ఆందోళనతో దిగి వచ్చిన అధికారులు

తిరిగి కొనుగోళ్లు ప్రారంభం

హుస్నాబాద్‌ : కందుల కొనుగోలు నిలిపివేయడంతో రైతులు రోడ్డెక్కారు. గంటల తరబడి ధర్నా చేశారు. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. ఎస్సై దాస సుధాకర్‌ రైతుల సమస్యను తెలుసుకొని, అధికారులతో మాట్లాడి కొనుగోళ్లు ప్రారంభింప చేస్తామని హామీనిచ్చినా రైతులు ససేమేరా అన్నారు. రహదారిపై ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో రైతులు తిరిగి మార్కెట్‌ యార్డు ఎదుట ధర్నాకు దిగారు. అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో తిరిగి  రహదారిపై బైఠాయించారు. దీంతో రైతులకు రెవెన్యూ, పోలీస్‌ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆందోళన తీవ్రం కావడంతో తహసీల్దార్‌ విజయసాగర్, ఎస్సై సుధాకర్‌ మార్కెటింగ్‌ శాఖ జిల్లా అధికారులతో మాట్లాడి కొనుగోళ్ల ప్రారంభానికి చర్యలు తీసుకున్నారు.

దీంతో రైతులు ఆందో«ళన విరమించారు. అంతకుముందు రైతులు మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి కంది గింజను కొంటామని చెప్పిన అధికారులు అర్ధంతరంగా కొనుగోళ్లు బంద్‌ చేయడమేమిటని నిలదీశారు. ఆదివారం దళారుల నుంచి క్వింటాళ్ల కొద్దీ కందులను కొనుగోలు చేశారని ఆరోపించారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.5,450 ఉంటే, కొనుగోళ్లు బంద్‌ చేశారని, బయట అమ్మడానికి వెళ్తే వ్యా పారులు క్వింటాలుకు రూ.3,000 ఇస్తూ దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. రైతుల ధర్నాకు అఖిల పక్షనాయకులు మద్దతు పలికారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు కవ్వ వేణుగోపాల్‌రెడ్డి, అయిలేని శంకర్‌రెడ్డి, ఆకుల వెం కట్, హన్మి రెడ్డి,  బొల్లి శ్రీనివాస్, వాల నవీన్, రైతు ల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు