300 మీటర్ల జాతీయ జెండాతో ‘స్వచ్ఛ ర్యాలీ’

26 Jan, 2018 15:34 IST|Sakshi
300 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీగా వెళ్తున్న విద్యార్థులు

సంగారెడ్డి జోన్‌ : వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పారిశుద్ధ్యాన్ని సక్రమంగా నిర్వహించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడాలని డీఆర్‌డీఏ వెంకటేశ్వర్లు సూచించారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా జిల్లా యంత్రాంగం గురువారం స్వచ్ఛగణతంత్ర వారోత్సవాలను నిర్వహించింది. ఇందులో భాగంగా స్థానిక ఐబీ అతిథిగృహం నుంచి కలెక్టరేట్‌ వరకు సుమారు 500 మంది కళాశాల విద్యార్థులతో కలిసి 300 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌డీఓ మాట్లాడుతూ.. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు  బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతంగా  యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. ప్రజలంతా స్వచ్ఛందగా సహకరించినప్పుడే లక్ష్యం నెరవేరుతుందన్నారు. ర్యాలీ కలెక్టరేట్‌కు చేరుకున్న అనంతరం జేసీ వాసం వెంకటేశ్వర్లు చేతులమీదుగా కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ ఏపీడీ సిద్ధారెడ్డి, ఏఓ మధులత, వివిధ కళాశాలల విద్యార్థులు, స్వచ్చభారత్‌ మిషన్‌ సిబ్బంది పాల్గొన్నారు. 
 

 

మరిన్ని వార్తలు