'నాన్నా మీరే నాకు స్పూర్తి.. వీ ఆర్‌ సో ప్రౌడ్‌'

30 Dec, 2019 17:06 IST|Sakshi

న్యూఢిల్లీ: సినీరంగంలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అందుకున్న నేపథ్యంలో.. తనయుడు అభిషేక్ బచ్చన్ తన తండ్రికి శుభాకాంక్షలు తెలుపుతూ తన భావోద్వేగాలను ట్విటర్‌ వేదికగా పంచుకున్నాడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకున్న నా తండ్రికి శుభాకాంక్షలు.

A memory to cherish. #dadasahebphalkeaward #theparentals

A post shared by Abhishek Bachchan (@bachchan) on

'నాకు మీరే స్ఫూర్తి అంటూనే మై హీరో.. కంగ్రాచ్యులేషన్స్ పా.. వీ ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యు.. ఐ లవ్ యు' అంటూ వ్యాఖ్యానించారు. ఇక అమితాబ్‌ కూడా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా అవార్డు అందుకున్నప్పటి ఫోటోను తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం డిసెంబర్‌ 23న జరిగింది. అయితే, అనారోగ్యం కారణంగా తాను రాలేకపోతున్నట్లు అమితాబ్ ముందుగా నిర్వాహకులకు చెప్పడంతో.. ఆదివారం ప్రత్యేకంగా ఈ అవార్డును రాష్టపతి ఆయనకు అందించారు.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు