దుమ్మురేపుతున్న మోనాలిసా డ్యాన్స్‌ వీడియో

11 May, 2019 17:59 IST|Sakshi

బిగ్‌బాస్‌ 10తో వెలుగులోకి వచ్చిన భోజ్‌పూరీ నటి మోనాలిసా సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటారు. తన అభిమానులను నిరాశపరచకుండా తరచూ ఏదో ఒక వీడియో పోస్ట్‌ చేస్తూనే ఉంటారు. కామెడీ వీడియోలు లేదా తన వ్యక్తిగత వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ అభిమానులను అలరిస్తారు. తాజాగా ఆమె డ్యాన్స్‌ చేసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్‌ పాపులర్‌ సాంగ్‌  ‘ కాలా చష్మా’ కు తనదైన స్టైల్లో స్టెప్పులేశారు. తన కోస్టార్‌ నాజర్‌తో కలిసి మోనాలిసా వేసిన స్టెప్పులు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

మరిన్ని వార్తలు