ప్రధానికి అమూల్‌ డూడుల్‌ శుభాకాంక్షలు!

17 Sep, 2019 18:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ రాజకీయ నాయకులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే పాల ఉత్పత్తులలో అగ్రస్థానంలో ఉన్న అమూల్‌ సంస్థ కూడా ప్రధాని మోదీకి ట్వీటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. అయితే అందరిలాగే అమూల్‌ కూడా ఏదో ‘హ్యాపీ బర్థ్‌ డే మోదీ జీ’ అంటూ ట్వీటర్‌లో పోస్ట్‌ చేసుంటారులే అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే!. అవునండి మీరే చూడండి మరి.. మోదీ కార్టూన్‌ బొమ్మల డుడూల్‌ వీడియోను ప్రత్యేకంగా తయారు చేసి పోస్ట్‌ చేసింది. ‘గౌరవ ప్రధాని నరేంద్ర మోదీకి 69వ పుట్టిన రోజు శుభాకాంక్షలు!’ అంటూ క్యాపన్‌తో పోస్ట్‌ చేసి అందరికన్నా భిన్నంగా శుభాకాంక్షలు తెలిపింది. దీంతో  ఈ వీడియో చూసిన  నెటిజన్లంతా ఫిదా అయిపోయి ‘అమూల్‌ అంటే బ్రాండ్‌ కాదు.. భారత్‌ ఎమోషన్‌’  ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

కాగా ఈ వీడియోలో మోదీ మొదటి సారి ప్రధాని అయిన తర్వాత ఆయన చేపట్టిన స్వచ్ఛ భారత్‌ పథకం నుంచి ఆయన పర్యటించిన అమెరికా, రష్యా, చైనాతో పాటు పలు విదేశి పర్యటించిప ఫోటోలను ఈ వీడియోలో చూపించారు. అంతేకాకుండా  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో వైట్‌ హౌజ్‌ బయట సమావేశం అయిన ఫొటోతో పాటు, ఇటీవల చంద్రయాన్‌-2 విఫలం నేపథ్యంలో ఇస్రో చీఫ్‌ కె. శివన్‌ను ఓదారుస్తూ ఆయనను హత్తుకున్న యానిమేటెట్‌ ఫోటో ఈ వీడియోలో చివరలో కనిపిస్తాయి.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు