‘టాయిలెట్‌ చూడటానికి సగం ప్రపంచం తిరిగాను’

22 Feb, 2019 08:52 IST|Sakshi

సామాజిక మాధ్యమాల్లో పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకునే విధంగా పలు ఛాలెంజ్‌లు వైరల్‌ అవుతున్నాయి. అందులో టీబీటీ(త్రో బ్యాక్‌ థర్స్‌డే) ఛాలెంజ్‌ కూడా ఒకటి. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా పలువురు ఈ ఛాలెంజ్‌లో పాల్గొని తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. 

తాజాగా మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్ టీబీటీ చాలెంజ్‌లో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను షేర్‌ చేశారు. గేట్స్‌ ప్రపంచ కుబేరుల్లో ఒకరైప్పటికీ సాధారణ జీవితాన్ని గడపటానికి ఇష్టపడుతుంటారు. గతంలో ఓ టాయిలెట్‌ వద్ద తాను దిగిన ఫొటోను గేట్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఆ సమయంలో ఓ టాయిలెట్‌ను చూడటానికి తాను సగం ప్రపంచం తిరిగానని ఆయన పేర్కొన్నారు. గేట్స్‌ షేర్‌ చేసిన ఫొటోలోని టాయిలెట్‌ చెక్కతో చేసినది చూడటానికి అపరిశుభ్రంగా ఉంది.

పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడాని బిల్‌ గేట్స్‌, ఆయన భార్య మెలిండా గేట్స్‌ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరు ‘రీ ఇన్వెంటెడ్‌ టాయిలెట్‌ ఎక్స్‌పో’  పేరుతో బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ పారిశుద్ధ్య రంగంలో సరికొత్త, చవకైన ఆవిష్కరణలను ప్రజల ముందుకు తీసుకొచ్చారు.

#TBT to that time I traveled halfway across the world to look at a toilet.

A post shared by Bill Gates (@thisisbillgates) on

మరిన్ని వార్తలు