ఈ వింత రకం జీవి పేరు మీకు తెలుసా!

9 Apr, 2020 17:25 IST|Sakshi

ఓ వింత రకం నల్ల జీవి వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.  అయినప్పటికీ ఆ జీవి ఎంటనేది ఇప్పటికీ స్పష్టత లేదు. ఇక అమిబాను పోలీ.. వాన పాముల సముహాంలా ఉన్న ఈ జీవి పేరూ.. ఇది ఏ జాతికి చెందిందో తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ఆసక్తిని కనబరుస్తున్నారు. గత వారం ట్విటర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో ఇప్పటికీ వైరల్‌ అవుతోంది. 14 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఓ రాతిపై నల్లగా పాదరసం ముద్దలా ఉన్న ఈ జీవిని కదిలిస్తుంటే వానపాములు సముహాంతో కూడినట్లు ఉన్న దాని శరీరం దగ్గరగా ముడుచుకుంటోంది. (గ్లౌస్‌ ధరించినా వైరస్‌ వ్యాపిస్తుంది!) 

ఓ ట్విటర్‌ యూజర్‌ ‘ఈ జీవి  ఎవరికైనా తెలుసా’ అనే క్యాప్షన్‌తో ట్వీట్‌ చేసిన ఈ వీడియోకు 19.5 మిలియన్లకు పైగా వ్యూస్‌ రాగా.. వందల్లో కామెంట్లు వస్తున్నాయి. ఇక ఈ వీడియోకు ‘మార్వెల్‌ కథలోని విలన్‌ వెనం నిజంగానే భూమిపైకి వచ్చినట్లు ఉన్నాడు’ ‘ఖచ్చితంగా ఇది విషంతో కూడిన జీవి అయ్యింటుంది’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతేగాక  మరికొందరూ మార్వెల్‌ వెనం జీఐఎఫ్‌ ఫొటోలను, వీడియోను షేర్‌ చేస్తున్నారు. దీనిపై కాలిఫోర్నియా బెరింగ్‌ రెషీయో(సీబీఆర్‌) అధికారులు స్పందిస్తూ.. వాస్తవానికి ఈ జీవి బూట్‌లేస్‌ సరిసృపాల జాతికి చెందినదయ్యింటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘అయితే ఈరకం జీవులు దాదాపు 180 అడుగుల పోడవు పెరిగుతాయి. ఇది కూడా ఆ జాతిలో ఒకటి కావచ్చు. ఇవి విషపూరిత శ్లేష్మాన్ని స్రవిస్తుంటాయి’ అని తెలిపారు. ఈ రకం జీవులను ముట్టినప్పుడు లేదా కదిలించినప్పుడు వాటి శరీరం జెల్లిలా కదులుతుందని కూడా చెప్పారు. (ఉపాసనకు థాంక్స్‌: డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌)

మరిన్ని వార్తలు