కండల వీరుడు.. స్నానం చేస్తుంటే..

12 Oct, 2017 10:05 IST|Sakshi

పెర్త్‌ : మెలితిరిగిన శరీరం అచ్చూ బాడీ బిల్డర్‌ను పోలిన కంగారూ ఇప్పుడు ఆస్ట్రేలియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. వెస్టర్న్‌ ఆస్ట్రేలియాలో గల మార్గరెట్‌ నదిలో బాడీ బిల్డర్‌ కంగరూ స్నానం చేస్తూ ఓ వ్యక్తి కంటపడింది. కంగారూ దేహధారుడ్యాన్ని చూసి మతి పోయిన అతను తన కెమెరాకు పని చెప్పాడు.

6.5 అడుగుల ఎత్తున్న కంగరూను పలు చిత్రాల్లో బంధించాడు. ప్రస్తుతం ఈ చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. కంగారూ తన వైపు రావడంతో అక్కడి నుంచి తప్పించుకుని వచ్చినట్లు చెప్పాడు. కండలు తిరిగిన కంగారూ దాదాపు 100 కిలోల బరువు ఉంటుందని వెల్లడించాడు.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు