చిచ్చరపిడుగు స్టంట్‌.. వైరల్‌

16 Jul, 2018 11:52 IST|Sakshi

పట్టుమని పదేళ్లు కూడా నిండని ఓ బుడ్డొడు చేసిన పని ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. సరదాగా వీధుల్లో ఆడుకుంటున్న ఓ కుర్రాడు.. బైక్‌ టైర్‌తో భలే విన్యాసాలు చేశాడు. టైర్‌ మధ్యలో దూరిపోయి ఎంచక్కా వీధుల్లో చక్కర్లు కొట్టేశాడు. పళ్లం వైపు  పర్లాంగు దూరం వెళ్లాక తిరిగి.. రివర్స్‌లో కాళ్లతో తోసుకుంటూ దూసుకురావటమే ఇక్కడ అసలు కొసమెరుపు. ఎక్కడ జరిగిందో? ఎప్పుడు జరిగిందో? స్పష్టత లేదు. కానీ, ఇప్పుడు సోషల్‌ మీడియాలో వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ఆ ఫీట్‌ను చూసిన వారంతా నోళ్లు వెళ్లబెడుతున్నారు. అయితే ఈ చిచ్చరపిడుగు స్టంట్‌ను సరదాకి కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నించకండని, అది చాలా ప్రమాదకరమని పిల్లలకు సూచిస్తూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు