వైరల్‌ : బెడ్‌రూమ్‌లో కొండ చిలువ విన్యాసాలు..!

19 Aug, 2019 17:18 IST|Sakshi

క్వీన్స్‌లాండ్‌ : పగలంతా ఉద్యోగానికి వెళ్లొచ్చి ఇంట్లో కాస్త సేద తీరుతామనుకున్న ఓ వ్యక్తికి ఊహించని అతిథి ఎదురైంది. బెడ్‌రూమ్‌లోని పడక మంచంపై దర్జాగా విన్యాసాలు చేస్తున్న ఓ భారీ కొండ చిలువ కంటబడింది. చచ్చాన్రా దేవుడా..! అనుకుంటూ అతను అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాడు. వెంటనే ‘సన్‌షైన్‌ కోస్ట్‌ స్నేక్‌ క్యాచర్‌’ అనే పాములు పట్టే సర్వీస్‌ సెంటర్‌కు ఫోన్‌ చేయడంతో వారొచ్చి ఆ కార్పెట్‌ పైథాన్‌ను పట్టుకెళ్లి అడవిలో వదిలేశారు. ఈ ఘటన ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్‌లో గత శనివారం జరిగింది. దీని గురించి సదరు స్నేక్‌ క్యాచర్‌ చేసిన ఫేస్‌బుక్‌ పోస్టు వైరల్‌గా మారింది.

‘బుసలు కొడుతున్న ఓ భారీ పాము బెడ్‌రూమ్‌లో దర్శనమివ్వడంతో ఓ వ్యక్తి మాకు ఫోన్‌ చేశాడు. వెంటనే వెళ్లి ఆ పైథాన్‌ను పట్టుకున్నాం. ఇంట్లోకి పురుగుపుట్రా ఏమీ చొరబడకుండా కిటికీలు, దర్వాజాలన్నీ మూసేసినా కూడా పామెలా వచ్చిందో అంతుబట్టడం లేదని ఆ ఇంటి యజమాని అనుమానం వ్యక్తం చేశాడు. అతను చెప్పింది నిజమే..! ఆ పాము బయటి నుంచి రాలేదు. సీలింగ్‌ (రూఫ్‌) నుంచి వచ్చి లైట్‌పై కూర్చుంది. దాని బరువుకు లైట్‌ విరిగిపడి బెడ్‌ మీద ఊడిపడింది. దాంతోపాటు పైథాన్‌ కూడా బెడ్‌పై చేరింది. ఆ సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇక ఇంట్లో ఎలాంటి అలికిడి లేకపోవడంతో  ఆ కొండచిలువ నిర్భయంగా విశ్రాంతిలో మునిగిపోయింది’అని స్నేక్‌ క్యాచర్‌ పేర్కొంది.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నేనూ స్టెప్పేస్తా..! : ఆనంద్‌ మహింద్రా

‘ఇప్పుడు మీరు లాటరీ టికెట్‌ కొనొచ్చు’

వీడు మామూలోడు కాడు : వైరల్‌

టిక్‌టాక్‌లో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు!

అయ్యో! ఎంత అమానుషం

నెటిజన్‌కు మాధవన్‌ సూపర్‌ కౌంటర్‌

కోహ్లి, రవిశాస్త్రిపై ‘రెచ్చిపోయిన’ నెటిజన్లు..!

జొమాటోతో ఉచిత ప్రయాణం; థ్యాంక్యూ!!

గ్రద్ద తెలివికి నెటిజన్లు ఫిదా: వైరల్‌

యువతి కంటి చూపు పోగొట్టిన ‘ఆన్‌లైన్‌’వంట

30 సెకన్లలో దొంగ దొరికేశాడు!

ఫోటో సాయంతో.. 24 ఏళ్ల తర్వాత

నా నోటికి చిక్కిన దేన్ని వదలను

స్ఫూర్తిదాయక కథ.. వేలల్లో లైకులు, కామెంట్లు..!

పీఎంతో పెట్టుకుంది.. అకౌంట్‌ ఊడిపోయింది!

‘మోదీ నటనకు అవార్డు ఇవ్వాల్సిందే!’

ముద్దుల్లో మునిగి ప్రాణాలు విడిచిన జంట..!

ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌లో వర్షం : వైరల్‌

చేయి పట్టుకొని లాగింది: వైరల్‌ వీడియో

బిల్లు చూసి ‘గుడ్లు’ తేలేసిన రచయిత..!

తాగుబోతు వీరంగం.. సినిమా స్టైల్లో: వైరల్‌

ముషారఫ్‌ ఇంట్లో మికా సింగ్‌.. నెటిజన్ల ఆగ్రహం

‘షేక్‌’ చేస్తోన్న శశి థరూర్‌

పాక్‌ మహిళ నోరుమూయించిన ప్రియాంక

సోషల్‌ మీడియాలో హాజీపూర్‌ కిల్లర్‌ వార్త హల్‌చల్‌

ట్రంప్‌ థమ్సప్‌ ఫోజు.. ఓ వివాదం

నాన్నను వదిలేయండి ప్లీజ్‌..!

భారీ వల చూడగానే అతనికి అర్థమైంది...

వైరల్‌ : మొసళ్ల బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హ్యాట్రిక్‌ కొట్టేశాడు : బన్నీ

వైరల్‌ అవుతున్న ప్రభాస్‌, జాక్వెలిన్‌ స్టెప్పులు

ఆకట్టుకుంటోన్న ‘కౌసల్య కృష్ణమూర్తి’ ట్రైలర్‌

అది డ్రగ్‌ పార్టీ కాదు..

‘తూనీగ’ ట్రైల‌ర్ విడుద‌ల

అనుష‍్క బికిని ఫోటో.. కోహ్లి కామెంట్‌