‘పాత ఙ్ఞాపకాలు.. కానీ కొంచెం కొత్తగా’

1 Nov, 2019 11:41 IST|Sakshi

న్యూఢీల్లి : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని తన అభిమానులు, ఫాలోవర్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంటూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా స్మతి తన పాత ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. తెలుపు రంగు దుస్తుల్లో, లూజ్‌ హేర్‌తో చిరునవ్వులు చిందిస్తున్న స్మృతి ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘పాతవే కానీ కొత్త ఙ్ఞాపకాలు’ అంటూ  స్మృతి షేర్‌ చేసిన ఫొటోకు అభిమానులు ఫిదా అవుతున్నారు.  ‘అందంగా ఉన్నారు.. ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండండి’ అంటూ హర్ట్‌ ఎమోజీలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కాగా హిందీ సీరియళ్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్మృతి ఇరానీ అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రి పదవి చేపట్టిన విషయం తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీని మట్టికరిపించి కాంగ్రెస్‌ కంచుకోట ఆమేథీలో జయకేతనం ఎగురవేశారు. ఈ క్రమంలో రెండో దఫా కేంద్రమంత్రిగా మోదీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ఇక ఆమెకు భర్త జుబిన్‌ ఇరానీ , పిల్లలు జోయిస్‌, జోహార్‌ ఉన్నారు. ప్రస్తుతం ఆమె కేంద్ర జౌళి, మహిళా-శిశు సంక్షేమ అభివృద్ది మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

మరిన్ని వార్తలు