మాస్టర్‌ చెఫ్‌కి యాక్షన్‌ హీరో అవార్డ్‌

13 May, 2020 12:16 IST|Sakshi

కరోనా వైరస్‌ మనిషిలోని మానవత్వాన్ని తట్టి లేపింది. చిన్నదో, పెద్దదో సాయం సాయమే. అందుకే కష్టంలో ఉన్న వారిని ఆదుకోవడానికి ధనవంతులు, సెలబ్రిటీలు, వ్యాపారస్తులు కోట్లు విరాళాలిస్తే.. పేద, చిరు ఉద్యోగులు తమ సంపాదనలో కొద్ది మొత్తం, ఓ పూట భోజనాన్ని ఇతరులకు పంచారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ సెలబ్రిటీ చెఫ్‌ వికాస్‌ ఖన్నా కూడా తనకు తోచిన రీతిలో పేదలకు సాయం చేస్తూ.. కష్ట కాలంలో ఆదుకుంటున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ సమయంలో వేతన జీవులే నానా ఇక్కట్లు పడుతున్నారు. అలాంటిది ఇక వృద్ధాశ్రమాలు, అనాధ శరణాలయాల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో వీరిని ఆదుకునేందుకు వికాస్‌ ఖన్నా ముందుకు వచ్చారు.
(చదవండి: ‘దిబ్బరొట్టె చేయడం నేర్పినందుకు గురుదక్షిణ’)

నగరాల్లో ఉన్న వృద్ధాశ్రమాలు, అనాధ శరణాలయాలు, ఆస్పత్రులకు నిత్యవసరాలు అందించేందుకు ఓ సప్లై చైన్‌ను రూపొందించారు వికాస్‌ ఖన్నా. తమను ఆశ్రయించిన వారినకి చేతనైన సాయం చేస్తున్నారు వికాస్‌ ఖన్నా. తాజాగా తనకు దిబ్బ రొట్టె నేర్పిన గురువు సత్యం వివరాలు తెలుసుకుని మరి గురు దక్షిణ సమర్పించారు. కష్ట కాలంలో వికాస్‌ ఖన్నా చేస్తున్న కృషిని గుర్తించిన చిల్డ్రన్స్‌ హోప్‌ ఇండియా అనే ఎన్జీవో సంస్థ వికాస్‌కు ‘యాక్షన్‌ హీరో’ అవార్డ్‌ ప్రకటించింది. ఆన్‌లైన్‌ వేదికగా ఈ నెల 16న వికాస్‌కు ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు సదరు సంస్థ తెలియజేసింది.

మరిన్ని వార్తలు