వైరల్‌ : దాగుడు మూతలు ఆడుతుంటే...

17 Oct, 2017 12:45 IST|Sakshi

బీజింగ్‌ : ఫ్రాంక్‌ వీడియోల పేరిట చేసే విన్యాసాలు ఒక్కోసారి వికటించి విషాదాలుగా మారిన ఉదంతాలు అనేకం. అయినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోకుండా కొందరు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే చైనా అనుహి ప్రొవిన్స్‌లో ఓ చిన్నారి సరదాగా చేసిన ప్రయత్నం ఆమెకు నరకం.. అధికారులకు కాసేపు చుక్కలు చూపించింది.

‌సుజౌ నగరం లింగ్బి కౌంటీలో ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలలో ఆ ఆరేళ్ల బాలిక చదువుతోంది. ఈ క్రమంలో స్నేహితులతో సరదాగా దాగుడు మూతలు ఆడుకుంటూ పక్కనే ఉన్న ఓ సందులోకి దూరింది. అయితే రెండు భవనాలకు చెందిన ఇరుకైన సందు కావటంతో ఆమె తల అందులో ఇరుక్కుపోయి రోదించసాగింది. ఆమె ఏడుపులు విన్న స్కూల్ యాజమాన్యం అత్యవసర సిబ్బందికి.. ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందజేసింది. 

తొలుత గోడ బద్ధలు కొట్టి ఆమెను బయటికి తీసేందుకు అధికారులు యత్నించగా.. అవతల ఉన్న మరోగోడ ఆమెపై కూలి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉండటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. చివరకు గోడకు అయిల్‌ లాంటి పదర్థాన్ని పూసి ఓ కాగితంతో రుద్ది ఆమె తలను నెమ్మదిగా వేరు చేసి బయటకు తీశారు. ఆ వీడియోను మీరూ చూడండి.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు