కూతురు కోసం 6 టికెట్లు కొన్నాడు..!

28 Dec, 2018 17:20 IST|Sakshi
కూతురు పియర్స్‌ వాఘన్‌తో తండ్రి హల్‌ వాఘన్‌

లోకంలో తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మనల్ని ఎవరూ ప్రేమించలేరు. అనంతమైన వారి ప్రేమ మన జీవితాలకు ఎంతో అవసరం కూడా. పిల్లల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తల్లిదండ్రులు.. తమ జీవితంలో వచ్చే అన్ని పండుగలు, సంతోషాలు, సంబరాలను వారితోనే కలిసి జరుపుకోవాలనుకుంటారు. కానీ నేటి కాలంలో ఉద్యోగాల వల్ల పిల్లలు ఒక చోట.. తల్లిదండ్రులు ఒక చోట ఉండాల్సిన పరిస్థితి. దాంతో సంవత్సరానికి ఒకటి, రెండు పండుగలను మాత్రమే అందరు కలిసి జరుపుకోగలుగుతున్నారు. ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది హాల్‌ వాఘన్‌ అనే వ్యక్తికి. కూతురుతో కలిసి పండుగ జరుపుకోవడం కోసం ఆ తండ్రి చేసిన పని నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ఆ వివరాలు..

పియర్స్‌ వాఘన్‌ అనే యువతి డెల్టా ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా పని చేస్తుంది. క్రిస్టమస్‌ సీజన్‌ దృష్టా రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆమెకు పండుగ నాడే కాక మరుసటి రోజు కూడా సెలవు దొరకలేదు. దాంతో పండుగ రోజున కూతురుతో ఉండాలనుకున్న హాల్‌, కూతురు డ్యూటి నిమిత్తం వెళ్లే ప్రతి ప్రాంతానికి తాను వెళ్లాలని భావించాడు. అందుకోసం ఆరు టికెట్లను కొన్నాడు. దాంతో పండుగ రోజున తండ్రి, కూతుళ్లిద్దరూ ఒకే చోట ఉన్నారు. మైక్‌ లేవి అనే ప్రయాణికుని ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చంది.

లేవి, హాల్‌తో పాటు అదే విమానంలో కలిసి ప్రయాణించాడు. మాటల సందర్భంలో లేవికి, హాల్‌ ప్రయాణం గురించి తెలిసింది. పియర్స్‌ పట్ల ఆమె తండ్రికున్న ప్రేమ చూసి ముగ్ధుడైన లేవి ఈ విషయం గురించి తన ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు. దాంతో ఈ తండ్రికూతుళ్ల అనురాగం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. నెటిజన్లు కూడా పియర్స్‌ తండ్రిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘రెచ్చగొడితే.. అన్నయ్యకు చేసిన మోసాలు బయటపెడ్తా’

బాబూ లీకేష్‌.. అఫిడవిట్‌లో కాపీనేనా?

కేఏ పాల్‌ పంచ్‌లపై వర్మ సెటైర్‌!

1,00,000 గ్రాఫిక్‌  డిజైనర్లు

హోరెత్తుతున్న సోషల్‌ మీడియా

జగన్‌ అనే నేను; అప్నా టైమ్‌ ఆయేగా...

‘బ్రౌన్‌ కలర్‌ ప్యాంట్‌ వేసుకున్న వ్యక్తిని నేనే’

పబ్‌జీతో జగిత్యాల యువకుడు బలి

‘ఇంటిని తగలబెట్టండి.. మీకు చాలా ధైర్యం ఉంది’

పక్కా దేశీ పేరెంట్స్‌ అనిపించుకున్నారుగా..!

బాబు ఇక ఆపు నీ డప్పు..

ఫొటోలకు ఫోజులు... భయానక అనుభవం!

‘కల’రింగ్‌బాబు...

ఓహో.. అందుకే లోకేష్‌ రాజీనామా చేయలేదా!

వైరల్‌ : భళారా.. బాలుడా!

వైరల్‌ : సితారా డాన్స్‌ వీడియో..!

‘చౌకీదార్‌’ నవ్వులపాలు

నోరు జారాడు... కోడిగుడ్డుతో సమాధానం

ఎద్దును గోమాతను చేసేశారు!

వైరల్‌ : ఫేస్‌బుక్‌ లైవ్‌తో రాక్షసానందం

నిజంగా ప్రేమిస్తే నిరూపించుకో.. తిక్క కుదిరిందా!

వాట్సాప్‌ ఎలక్షన్స్‌

చేదు అనుభవం; ఎయిర్‌లైన్స్‌ క్షమాపణలు!

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ను మించిన వెన్నుపోటు’

బాబు అప్పుడే చెమటలా.. కాస్త ఫ్యాన్‌ వేసుకో!

4డీ పబ్లిసిటీతో ప్రచారంలో కొత్త పుంతలు

అమరావతికి జగనే పర్మినెంట్‌.. బాబు అద్దెదారుడే 

ఇదీ ఇప్పటి  కొత్త సంప్రదాయం!

నేనూ మనిషినేగా..అందుకే!

తెలుగు తమ్ముళ్లకు ఇంత వణుకా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శింబుతో సెట్‌ అవుతుందా?

ఎంట్రీతోనే ఇద్దరుగా..!

దగ్గుబాటి కల్యాణ వైభోగమే...

నెక్ట్స్‌ ఏంటి?

బిజీ బిజీ

స్టైలిష్‌ రాయుడు