వైరల్‌ వీడియో: భార్యను ఎత్తలేక ఎత్తేశాడు

17 Nov, 2019 14:50 IST|Sakshi

మ్యూజికల్‌ చైర్‌ కాంపిటేషన్‌ అందరికీ గుర్తుండే ఉంటుంది. పాఠశాల రోజుల్లో ఈ ఆట ఆడని వారెవ్వరూ అండరూ. అయితే ఈ ఆటని కొంచెం వినూత్నంగా మార్చి.. భార్య భర్తల మధ్య పోటీ పెడితే ఎలా ఉంటుంది. సరిగ్గా అలాంటి ఆలోచనకు ఓ పెళ్లి వేడుక వేదికైంది. గేమ్‌ ఎంటంటే.. కుర్చీలను ఒకదానిపై ఒకటి ఎత్తుగా పెట్టి.. భార్యను పైకి ఎత్తి వాటిపై కూర్చోపెట్టాలి. అలా ఒక్కో కూర్చీని పైకి పేరుస్తూ.. ఎత్తును పెంచుకుంటూ పోవాలి. అలా ఎవరు ఎక్కువ కుర్చీలపై (ఎత్తు) భార్యను కూర్చోపెడితే ఆ జంటను విజేతగా ప్రకటిస్తారు. ఓ పెళ్లి వేడుకలో బంధువులంతా ఈ టాస్క్‌ను నిర్వహించగా.. దీనిలో దాదాపు నాలుగైదు జంటలు పాల్గొన్నాయి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన భార్యను 17 కుర్చీలు ఎత్తుగా వేసి వాటిపై కూర్చోపెట్టే ప్రయత్నం చేశాడు. కానీ అంత ఎత్తుకు భార్యను ఎత్తలేక ఒక్కసారిగా కింద పడేశాడు. దీంతో అంత ఎత్తునుంచి కిందపడిపోయింది. ఈ ఆటనంతా  అక్కడున్నవారు వీడియోలో చిత్రీకరించారు. ఇది కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా