ప్రేమను వ్యక్తపరచడానికి మాటలు అవసరమా?

21 Oct, 2019 20:18 IST|Sakshi

వినికిడి లోపం గల ఓ తండ్రి తన కుమార్తెతో సైగలతో సంభాషిస్తున్న వీడియోను అమెరికా మాజీ బాస్కెట్‌బాల్ ప్లేయర్‌ రెక్స్ చాప్మన్ ట్విటర్‌లో తాజాగా షేర్‌ చేశారు. దీంతో ఈ వీడియో  సోషల్‌ మీడియాలో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. వినికిడి లోపం గల ఓ తండ్రి అప్పుడే పుట్టిన తన చిన్నారితో సైగలతో మాట్లాడే మాటాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రేమకు భాష లేకపపోతే ఏంటి?  తండ్రి తనపై కురిపిస్తున్న ఆత్మీయ స్పర్శ, ప్రేమ చాలు అనేలా.. ఆ చిన్నారి చూస్తున్న చూపులు నెటిజన్లను కంటతడి పెట్టిస్తుంది.  

This hearing-impaired father expressing love to his newborn daughter in sign-language is the definitely Twitter content I’m here for...💪😍😇😊🔥 pic.twitter.com/CEvINcmRaX

వినికిడి లోపం ఉన్న ఆ తండ్రి అప్పుడే పుట్టిన తన బిడ్డతో సైగలతో మాట్లాడుతుంటే.. ఆ పాపాయి తదేకంగా నువ్వు చెప్పే ప్రతీది తనకు అర్థమవుతోంది అన్నట్లు చూస్తోంది. కుమార్తెపై ఈ మూగ తండ్రి కురిపిస్తున్న ప్రేమను చూసిన  ప్రతి ఒక్కరికి నిమిషం పాటు.. నోట మాట రాదంటే నమ్మండి.  ఈ వీడియోను చూసి కొందరు ఆశ్చర్యపోతుంటే.. మరికొందరు మాత్రం ఆ తండ్రి సైగలకు అర్థాన్ని వెతికే పనిలో పడ్డారు. 

సంకేత భాషను అర్థం చేసుకున్న కొద్దిమంది నెటిజన్లు.. ఆ తండ్రి తన చిన్నారితో.. ‘హేయ్‌ నేను మీ డాడీని. నేను నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ కళ్లు  ఆకుపచ్చ రంగులో అద్భుతంగా ఉన్నాయి. నీ అందమైన చిరునవ్వు బావుంది.  నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వెచ్చని దుప్పటిలో ఉన్న ఓ చిన్నదానా..!  నేను నిన్ను ప్రేమిస్తున్నానే..' అంటున్నాడని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేయగా.. 'ప్రేమ అన్ని భాషలను మించిపోయింది' అని మరోక నెటిజన్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు