వైరలవుతోన్న ఢిల్లీ మహిళా పోలీసుల డ్యాన్స్‌

2 Apr, 2019 17:12 IST|Sakshi

న్యూఢిల్లీ : హర్యానాకు చెందిన ప్రముఖ సింగర్‌ కమ్‌ డ్యాన్సర్‌ సప్నా చౌదరి అంటే తెలియని వారుండరు. ఆమె పాటల్లో ‘తేరి ఆఖోంకా ఏ కాజల్’ చాలా ఫేమస్‌. ఎంతలా అంటే యూట్యూబ్‌లో ఈ సాంగ్‌ను ఇప్పటికే 380 మిలియన్ల మంది చూశారు. ఇప్పుడు ఇదే పాటకు ఢిల్లీ మహిళా పోలీసులు అదిరిపోయే స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. గత నెల 30న సౌత్‌ వెస్ట్‌ ఢిల్లీ పోలీసులు ‘సునో సహెలీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. దానిలో భాగంగా సప్నా చౌదరి ‘తేరి ఆఖోంకా ఏ కాజల్’ పాటను ప్లే చేశారు.

ఇంకేముంది ఓ ముగ్గురు, నలుగురు మహిళా పోలీసు అధికారులు స్టేజీ మీదకు ఎక్కి డ్యాన్స్‌ చేయడం ప్రారంభించారు. అంతటితో ఊరుకోక ఐపీఎస్‌ అధికారిణి బెనిటా మారి జైకర్‌ను కూడా తమతో పాటు స్టేజీ మీదకు లాకెళ్లారు. దీన్ని స్పోర్టీవ్‌గా తీసుకున్న ఐపీఎస్‌ అధికారిణి కూడా మిగతా వారితో కలిసి స్టెప్పులేసింది. డ్యాన్సర్‌, సింగర్‌ అయిన సప్నా చౌదరికి హర్యానాలో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. అయితే బిగ్‌బాస్‌ షోలో పాల్గొనడంతో ఆమె గురించి దేశం అంతా తెలిసింది. గత ఏడాది గూగుల్‌లో అత్యధిక మంది సర్చ్‌ చేసింది కూడా సప్నా​ చౌదరి గురించేనట.

మరిన్ని వార్తలు