ఈ చిన్నారి.. నెటిజన్ల హృదయాలు గెలిచింది

2 Nov, 2018 10:14 IST|Sakshi

పుట్టగానే తల్లిని కోల్పోయింది... ఇంకో ఇరవై రోజులు గడవకముందే తండ్రి కూడా ఆమెకు దూరమయ్యాడు... అన్నీ కోల్పోయినా ఆ చిన్నారిని దేవుడు మరోసారి చిన్నచూపు చూశాడు.. బుడిబుడి అడుగులు వేయాల్సిన వయసులో నడవలేని పరిస్థితి కల్పించాడు.. అయినా ఆ చిన్నారి మోముపై చిరునవ్వు చెరగలేదు.. ఆ చిరునవ్వే నేడు ఆమెను సమస్య నుంచి బయటపడేలా చేసింది. అంతేకాదు.. సోషల్‌ మీడియా అంటే కేవలం అనవసరపు చర్చలు, ట్రోలింగ్స్‌కు మాత్రమే వేదిక అనే భావనను తప్పని మరోసారి నిరూపించింది.

ఆరుషి మహారాష్ట్రలోని సతారాకు చెందిన చిన్నారి. 70 ఏళ్ల బామ్మా తాతయ్య, కవల సోదరుడితో కలిసి జీవిస్తోంది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆరుషికి ఏడాది వయసు ఉన్నపుడు కాన్‌జెన్షియల్‌ సుడత్రాసిస్‌(కాలి ఎముక వంగిపోవడం) అటాక్‌ అయింది. అప్పటికే కొడుకు కోడలిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆరుషి బామ్మాతాతయ్యలు ఈ ఘటనతో మరింత కుంగిపోయారు. ఆరుషి కూడా అందరు చిన్నారుల్లాగే లేడి పిల్లలా గెంతాలంటే ఆపరేషన్‌ చేయించాలని.. అందుకోసం 16 లక్షల రూపాయలు అవసరమని తెలిసి హతాశయులయ్యారు.

ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న ఆ వృద్ధ దంపతులకు  ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’  అండగా నిలిచింది. వారి కన్నీటి గాథను తమ ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేయడంతో పాటు ఆరుషి కోసం ఫండ్‌రైజింగ్‌ క్యాంపెయిన్‌ని ఏర్పాటు చేసింది. కాలికి పింక్‌ బ్యాండేజ్‌ ఉన్న చిన్నారి ఆరుషి ఎంతో హృద్యంగా నవ్వుతున్న ఫొటోతో కూడిన ఈ పోస్టు నెటిజన్ల హృదయాలను కదిలించింది. అందుకే 980 మంది దాతలు ముందుకొచ్చి కేవలం ఆరు గంటల్లోనే ఆరుషి ఆపరేషన్‌కు కావాల్సిన 16 లక్షల రూపాయలు సమకూర్చారు. సోషల్‌ మీడియా పవరేంటో మరోసారి నిరూపించారు.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అదొక భయానక దృశ్యం!

‘ఈ వీడియో షేర్‌ చేయడం ఆనందంగా ఉంది’

కోహ్లి ఒక్క పోస్ట్‌కు రూ.కోటి!

భయానక అనుభవం; తప్పదు మరి!

చంద్రయాన్‌-2పై భజ్జీ ట్వీట్‌.. నెటిజన్ల ఫైర్‌

అక్కడ సెల్ఫీ తీసుకుంటే అదుర్స్‌!

విమానం పైకెక్కి వ్యక్తి హల్‌చల్‌

‘థ్యాంక్‌ గాడ్‌.. ఆ బాలుడు చేపకు చిక్కలేదు’

అదరగొడుతున్న చిన్నారి రిపోర్టర్‌

‘శారీ ట్విటర్‌’ .. క్రికెటర్‌కు ముద్దు పెట్టింది

అన్నా.. గడ్డంతో చాలా అందంగా ఉన్నారు

జలుబు మంచిదే.. ఎందుకంటే!

ట్వీట్‌లు వద్దయ్యా.. డొనేట్‌ చేయండి!

వీవీఐపీ టాయిలెట్స్‌.. పేలుతున్న జోకులు

ఆ మినిస్ట్రీ టాయిలెట్లకు బయోమెట్రిక్‌ మెషిన్లు! 

అదే నోటితో.. మటన్‌, బీఫ్‌ కూడా..

ఆమె వచ్చింది.. అతన్ని చితక్కొట్టింది

చాలా అందమైన ఫొటో..ఆమె గొప్పతల్లి...

‘అప్పటి నుంచి మైండ్‌ మరింత దెబ్బతిన్నట్టుంది’

మీరు అసలు మనుషులేనా..ఇంతలా హింసిస్తారా?

పెళ్లి అయ్యాకే తెలుస్తుంది : విద్యాబాలన్‌

తొలిసారి ఎయిర్‌పోర్ట్‌కొచ్చి.. ఆగమాగం!

అంతుచిక్కని రోగం: ముఖం భయంకరంగా..

ఒట్టేసి చెబుతున్నాం.. మీకు అన్నీ ఫ్రీ!

నడిరోడ్డుపై అంకుల్‌ బిత్తిరి చర్య

ట్రోలింగ్‌ : తాప్సీ దిమ్మతిరిగే కౌంటర్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

‘మీ అందం ఏ మాత్రం చెక్కు చెదరలేదు’

ఇదో ఘనకార్యమైనట్టు.. ఇలా ఫొటో దిగారు!!

టీనేజ్‌ అమ్మాయి మొబైల్‌ వాడితే జరిమానా..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అన్నీ గుర్తుపెట్టుకుంటా; ఐశ్‌ భావోద్వేగం!

తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన రానా

ప్రయాణం ముగిసింది; మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా!

‘సాహో’తో సై!

కలలో కూడా అనుకోలేదు: షాహిద్‌

‘ఈ వీడియో షేర్‌ చేయడం ఆనందంగా ఉంది’