వరద బీభత్సం; నదిలో కొట్టుకుపోయిన వాహనాలు

27 Jun, 2019 18:01 IST|Sakshi

బీజింగ్‌ : చైనాలో వాన బీభత్సానికి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఈ క్రమంలో దాదాపు 1000 మంది సహాయక బృందాల సిబ్బంది పౌరులను రక్షించేందుకు రంగంలోకి దిగారు. మరోవైపు వరద దాటికి పార్కు చేసి ఉన్న వాహనాలు సైతం నీటిలో కొట్టుకుపోతున్నాయి. ఈ క్రమంలో నైరుతి చైనాలో నదీ తీరాన రోడ్డుపై నిలిపి ఉంచి కార్లు అందులో పడిపోయాయి.

గుజూ ప్రావిన్స్‌లో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా గత కొన్ని రోజులుగా చైనాలో ప్రకృతి విపత్తులు సంభవిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కొండచరియలు విరిగి పడటంతో ఆస్తి నష్టం సంభవించింది.

మరిన్ని వార్తలు