ఈ వీడియో నిజంగా కంటతడి పెట్టిస్తుంది

3 Apr, 2020 19:22 IST|Sakshi

నార్త్‌ కరోలినా : మనం ఇంట‌ర్‌నెట్‌లో రోజుకి ఎన్నో వీడియోలు చూస్తుంటాం. అయితే మీరు ఇప్పుడు చూసే వీడియో మాత్రం కంటతడి పెట్టిస్తుంది. అమెరికాకు చెందిన గ్యాబీ క్యాన్సర్‌ బారిన ప‌డింది. ట్రీట్‌మెంట్ కోసం గ్యాబీకి త‌ల‌మీద జుట్టు, కనుబొమ్మలు తొల‌గించారు. అయితే ఆమెకు క్యాన్సర్‌ సోకిన దానికంటే అంద‌వికారంగా ఉంద‌నే భావన ఆమె మనుసును ఎక్కువ‌గా క‌లచివేసేది. దీంతో గ్యాబీ బాధను పోగొట్టేందుకు ఆమె సోదరి క్యామి కూడా త‌న జుట్టు, క‌నుబొమ్మలు తీసేసింది. ఆ తర్వాత క్యామి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఒక వీడియోనూ షేర్‌ చేసింది. క్యామి మాటలు ఇప్పుడు అందరి గుండెలను బరువెక్కిస్తున్నాయి. (క‌రోనా: ఆసుప‌త్రిలో అమెరికా డాక్ట‌ర్ల డ్యాన్స్‌)

'నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం. నువ్వు ఎలా ఉన్నా నాకు మాత్రం అందంగానే కనిపిస్తావు. నువ్వు రోగంతో బాధపడుతూ నీ జట్టు, కనుబొమ్మలు తీసేసుకోవాల్సి వచ్చింది. కనుబొమ్మలు తీసేసిన తర్వాత అందంగా లేక‌పోవ‌డం వ‌ల్లే క‌దా నువ్వు బాధ‌ప‌డుతున్నావు. ఇదిగో ఇప్పుడు నేను కూడా నా కనుబొమ్మలు, జుట్టు తొలగించుకున్నా. ఒక్కటి మాత్రం నిజం.. నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు. ఇదంతా నేను ఎవ‌రికోస‌మే చేయ‌డం లేదు.. కేవలం నీకోసమే మై లవ్లీ సిస్టర్‌ అంటూ' తన చెల్లికి ధైర్యం చెప్పింది. ఆ త‌ర్వాత వారిద్దరు ఏడుస్తూ ఒక‌రిని ఒక‌రు కౌగిలించుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్‌గా మారింది. గ్యాబీ తొంద‌ర‌గా కోలుకోవాలి... మీరిద్దరు ఆనందంగా ఉండాలంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

cant say everything thats been going on has been easy, its been hard, it hurts. but this isnt for any of you or for me, this is for you gaby. I LOVE YOU w every bone in my body. u fight bitch & u do it damn well. hair does not make you. and even bald u still manage to b the prettiest sister, u whore. i love you so so so so much boot boot & every battle u go thru, i promise to go thru it w u cus thats what mf sisters do ❤️

A post shared by yung mila (@trillcami) on

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా