వైరల్‌ : ఎలుగుల కొట్లాట.. చివరికి ఏమైంది..!

23 Sep, 2019 16:10 IST|Sakshi

విక్టోరియా : గ్రే కలర్‌ ఎలుగు బంట్లు భీకరంగా తలపడిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయింది. ‘అరుదైన ఎలుగుల పంచాయితీ చూడండి. మునివేళ్లపై నిల్చుని పరస్పరం ముష్టిఘాతాలు కురిపించుకుంటున్నాయి. గుర్రుగుర్రుమంటూ ఒకదాన్ని మరొకటి నెట్టేసుకుంటూ ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఇక రెండు ఎలుగుల్లో ఏదైనా చస్తే బాగుండు. ఫుడ్డుకు ఢోకా ఉండదు అన్నట్టు నక్కినక్కి చూస్తున్న గుంటనక్కను పరిశీలించండి’అని క్యారీ మెక్‌ గిల్‌వ్రే అనే మహిళ ఓ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.

నిముషానికి పైగా ఉన్న ఈ వీడియో 1.6 మిలియన్‌ వ్యూస్‌ సాధించి వైరల్‌ అయింది. బ్రిటీష్‌ కొలంబియాలోని ఓ హైవేపై ఈ దృశ్యం వెలుగు చూసింది. వీడియో ఆసక్తిగా ఉందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి గొడవ సద్దుమణిగిందా లేదా అని ప్రశ్నిస్తున్నారు. వీడియో ఆసక్తిగా ఉన్నా.. ఎలుగులకు ఏమౌతుందోనని ఆందోళన చెందానని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ గొడవనంతా గమనిస్తున్న నక్కను తొలుత గమనించలేకపోయానని మరో యూజర్‌ చెప్పుకొచ్చాడు.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు