అల్లుడిలా బాలయ్య కూడా వర్థంతి చేశాడుగా !

29 May, 2019 17:05 IST|Sakshi

సాక్షి, హిందూపురం : సోదరుడు మరణిస్తే సంభ్రమాశ్చర్యానికి గురైన హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ.. తాజాగా తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ జయంతిని వర్ధంతిని చేశారు. తత్తరపాటుకు లోనవ్వడంలో అల్లుడు నారాలోకేశ్‌ను మించిపోతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ప్రభంజనానికి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కొట్టుకుపోయినా బాలయ్య మాత్రం హిందూపురం నుంచి రెండోసారి విజయం సాధించారు. మంగళవారం తన తండ్రి జయంతి వేడుకులను నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి సతీమణి వసుంధరతో కలిసి పాలభిషేకం చేశారు. అనంతరం హిందూపురంలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ 96వ జయంతిని కాస్త వర్థంతిగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. నెటిజన్లు బాలయ్యను ఓ ఆట ఆడుకుంటున్నారు. జనాలను నవ్వించడంలో మామ అల్లుళ్లు ఏమాత్రం తగ్గడం లేదు కదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
ఎన్టీఆర్‌ జయంతిని వర్ధంతి చేసిన బాలయ్య

గతంలో సోదరుడు నందమూరి హరికృష్ణ మరణం సందర్భంగా మాట్లాడుతూ ఆయన మరణంతో సంభ్రమాశ్చర్యానికి గురైనట్లు తెలిపి నవ్వులపాలైన బాలయ్య.. సినీ దర్శకుడు కోడి రామకృష్ణ మరణించినప్పుడు కూడా ఇలానే మాట్లాడారు. ఇక తెలంగాణ ఎన్నికల ప్రచారంలో సారే జహాసె అచ్చా పాడబోయిన బాలయ్య.. అది పాడలేక బుల్‌బుల్‌ బాలయ్యగా బిరుదు పొందిన విషయం తెలిసిందే. ఆయన అ‍ల్లుడు నారా లోకేశ్‌ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతిని వర్థంతిగా సంభోదించి విమర్శలపాలయ్యారు.  

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

టిక్‌ టాక్‌ వీడియోలు.. వారిని సస్పెండ్‌ చేయలేదు!

ఫేక్‌న్యూస్‌ : 15వ దలైలామాగా ‘సత్యసాయి’ విద్యార్థి

విన్‌.. సోషల్‌ ప్రొటీన్‌

యాంగ్‌ యాంగ్‌ బీభత్సం.. ఎగిరెగిరి తన్నుతూ..

మీ బ్యాంకులను అడగండయ్యా..!

మొసలిని మింగిన కొండచిలువ!

ఇలాంటి నాగిని డ్యాన్స్‌ ఎక్కడా చూసి ఉండరు

‘తనతో జీవితం అత్యద్భుతం’

ఎలుగుబంటికి వార్నింగ్‌ ఇచ్చిన కుక్క

నన్నెందుకు బ్లాక్‌ చేశారు : నటి ఫైర్‌

నా మొదటి పోస్ట్‌ నీకే అంకితం: రామ్‌చరణ్‌

ధోని అన్నా ఇప్పుడే రిటైర్మెంట్‌ వద్దు

‘ధోని మాత్రమే రక్షించగలడు’

మద్యం మత్తులో బహిష్కృత ఎమ్మెల్యే హల్‌ చల్‌

చరణ్‌ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్‌

డక్‌వర్త్‌ లూయిస్‌ను సిలబస్‌లో పెట్టాలి

అపరిచిత మహిళకు షమీ మెసేజ్‌

‘బుస్‌..స్‌..స్‌’ ఇంత పెద్ద పామా..?

వింత పోటీలో గెలిచిన లిథువేనియా జంట

‘చచ్చిపో కానీ ఇల్లు వదిలేయ్‌’

‘ఎఫ్‌బీ, ట్విటర్‌ లేకుండానే ఆ సదస్సు’

చేపను మింగాడు.. అది ప్రాణం తీసింది!

ఐస్‌క్రీమ్‌ దొంగ దొరికింది.. రిపీట్‌ అయితే!

అతడికి గుర్తుండిపోయే బర్త్‌డే ఇది: వైరల్‌

నన్ను నేను తయారు చేసుకుంటా!

పర్వతాల దెయ్యాన్ని ఈ పార్కు దగ్గర చూడొచ్చు..!

అది ఆపిల్‌ పండు కాదమ్మా.. ఆపిల్‌ కంపెనీ!

వైరల్‌ : పాప్‌కార్న్ తింటూ సినిమా చూసిన రాహుల్‌

చర్చనీయాంశమైన డాక్టర్‌ వ్యవహారం..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం