టిక్​టాక్​: మీ డేటా డౌన్​లోడ్​ చేసుకోవాలంటే?

1 Jul, 2020 14:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: చైనాతో ఉద్రిక్తతల నడుమ టిక్​టాక్​ సహా 59 యాప్స్​ను ఇండియా బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 27.76 కోట్ల మంది టిక్​టాక్​ను వాడుతున్నారు. ఇందులో 11.9 కోట్ల మంది భారతీయులే. 2019లో ఐఫోన్లలో అత్యధికంగా డౌన్​లోడ్​ అయిన యాప్స్​లో టిక్​టాక్​ నాలుగో స్థానంలో ఉంది.

బ్యాన్​ విధించిన నాటి నుంచి గూగుల్​ ప్లే స్టోర్, యాపిల్​ యాప్​ స్టోర్​​లో టిక్​టాక్​​ కనిపించకుండా పోయింది. అయితే, ఇప్పటికే టిక్​టాక్​ను ఇన్​స్టాల్​ చేసుకున్న వాళ్లు వారి ప్రొఫైల్​ డేటాను, వీడియోలను యాప్​ నుంచి డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. ఇందుకు ఏం చేయాలంటే..

వీడియోల డౌన్​లోడ్​ కోసం..

  • టిక్​టాక్​ యాప్​ను తెరచి మీ ప్రొఫైల్​లోకి వెళ్లండి
  • మీరు డౌన్​లోడ్​ చేయాలనుకున్న వీడియోపై క్లిక్​ చేయండి
  • మూడు చుక్కలున్న మీటను నొక్కి వీడియోను సేవ్​ చేయండి

ప్రొఫైల్​ డేటా కోసం..

  • టిక్​టాక్​ను తెరచి కుడి వైపు పైన ఉన్న మూడు చుక్కల మీటను నొక్కండి
  • ప్రైవసీ, సేఫ్టీలోకి వెళ్లి డేటా పర్సనలైజేషన్ ను ఎంచుకుని డేటా డౌన్​లోడ్​పై క్లిక్ చేయండి
  • మీ రిక్వెస్ట్​ టిక్​టాక్​కు వెళుతుంది
  • 30 రోజుల్లోగా మీ సమాచారం మీకు యాప్​ అందుబాటులోకి వస్తుంది. నాలుగు రోజుల్లోగా డౌన్​లోడ్ చేసుకోండి. లేకపోతే ఎక్స్​పైర్ అవుతుంది.
  • మీ రిక్వెస్ట్​ ఆమోదం పొందితేనే డేటాను పొందగలరు.

చదవండి: గూగుల్‌ క్రోమ్‌ ఇన్‌స్టాల్‌ చేసుకునేటప్పుడు జాగ్రత్త

మరిన్ని వార్తలు