ఈయన కథ వింటే కన్నీళ్లే..!

24 May, 2019 13:34 IST|Sakshi

ఛండీగడ్‌ : వెన్నుపోటు ఈ మాట రాజకీయాల్లో తరచుగా వినిపించే మాట. నమ్మిన నాయకులకు, పార్టీలకు వ్యతిరేకంగా పనిచేసి వారిని దొంగచాటుగా పడగొట్టడమే వెన్నుపోటు. అయితే, సొంత కుటుంబంలోని వారే వెన్నుపోటు పొడిస్తే.. వారి బాధ వర్ణనాతీతం.17వ లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని జలంధర్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన నీతు సుతేరన్‌ వాలా కూడా అదే బాధ పడుతున్నాడు. కుటుంబంలో ఉన్న 9మంది ఓటర్లలో ఐదుగురు మాత్రమే అతనికి ఓటు వేశారు. దీంతో అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సొంతవాళ్లే తనకు ఓటువేయలేదని మీడియా ఎదుట కన్నీరుమున్నీరయ్యాడు. ఈ ఘటన సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజున (మే 23) జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. 

అయితే, తొలిసారి ఎన్నికల్లో పోటీచేసే సుతేరన్‌కు కౌంటింగ్‌పై కనీస అవగాహన లేనట్టు తేలింది. తొలిరౌండ్‌లో అతనికి 5 ఓట్లు వచ్చాయని, అయితే తనకు పడిన మొత్తం అవే అని సుతేరన్‌ భ్రమపడినట్టు తెలిసింది. జలంధర్‌ లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో 19వ స్థానంలో నిలిచిన సుతేరన్‌ 856 ఓట్లు సాధించినట్టు ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌ వెల్లడించింది. ఇక ఈసారి కూడా దేశమంతా నరేంద్ర మోదీ గాలి వీచింది. ఎన్డీయే 349 సీట్ల అఖండ మెజారిటీ సాధించింది.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వార్తలు