వైరల్‌: పిల్లల కోసం.. బుల్లి ఆటో..

27 Jan, 2019 17:06 IST|Sakshi

తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆడుకోవడానికి చాలా రకాల బొమ్మలు కొనిస్తారు. అందులో కొత్తదనం ఎముందని అనుకున్నాడో తెలియదు కానీ.. తన పిల్లల కోసం ఎదో ఒకటి కొత్తగా చేయాలనుకున్నాడు కేరళ చెందిన ఓ వ్యక్తి. అనుకున్నదే తడవుగా పిల్లల కోసం నిజమైన ఆటోలా నడిచే ఓ బుల్లి ఆటోను తయారుచేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన అరుణ్‌కుమార్‌ పురుషోత్తమన్‌ ఇడుక్కి జిల్లా ఆస్పత్రిలో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తున్నారు. కొద్దిరోజుల కిందట అతని పిల్లలు మోహన్‌లాల్‌ నటించిన ‘అయ్‌ ఆటో’ చిత్రాన్ని చూశారు. తర్వాత తమకు ఆటో కావాలని తండ్రిని కోరారు. అయితే పిల్లలకు బొమ్మ ఆటోను కొనడానికి బదులు, వారికి నిజంగా నడిచే బుల్లి ఆటో తయారు చేసి ఇవ్వాలనుకున్నారు అరుణ్‌కుమార్‌. వెంటనే నిజమైన ఆటోకు ఏ మాత్రం తీసిపోకుండా చిన్ని ఆటోను తయారు చేసి ఇచ్చారు. ఆ ఆటోను అందంగా అకరించడంతో పాటు.. అందులో మోహన్‌లాల్‌ ఫొటోను కూడా ఉంచారు. దీనిని చూసిన పిల్లలు ఎంతగానో మురిసిపోతున్నారు. అందులో కూర్చోని.. దానిని నడుపుతూ ఆనందపడిపోతున్నారు.

పిల్లలు ఆటోను నడుపుతున్న వీడియోతోపాటు.. ఆటో తయారీకి తాను ఉపయోగించిన పరికరాలను వివరంగా తెలియజేసేలా ఓ వీడియోను అరుణ్‌కుమార్‌ సోషల్‌ మీడియాలో ఉంచారు. అరుణ్‌కుమార్‌ సృజనాత్మకతపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గతంలో కూడా అరుణ్‌కుమార్‌ పిల్లలు ఆడుకోవడానికి జీప్‌ను తయారుచేశారు.
 

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా