చిన్నారుల అద్భుత ప్రదర్శన.. వీడియో వైరల్‌

16 Apr, 2020 13:39 IST|Sakshi

డిస్పూర్‌: జనాదరణ పొందిన అస్సామీ ప్రేమ పాట ‘ఈ హాహీ బాల్‌ లాగే’ పాటను ఓ చిన్నారిపాడుతుంటే, మరో బాలుడు డ్రమ్స్‌ వాయిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. బాలుడు సొంతంగా తయారు చేసుకున్న డ్రమ్‌సెట్‌తో వాయిస్తుంటే, బాలిక తన మృధువైన స్వరంతో పాటను పాడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

రూపాలి ప్రణమిత ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో పిల్లలు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. అమ్మాయి పాటకు తగ్గా, సరైన బీట్స్‌తో బాలుడు మ్యూజిక్‌తో అదరగొట్టాడు. ఇక బాలుడు డ్రమ్‌సెట్‌ కోసం వినియోగించిన అట్టపెట్టెలు, అరటి చెట్టు కొమ్మలు, మెటల్‌ ట్రేలు అందరినీ విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఈ వీడియో పోస్ట్‌ చేసిన సమయం నుంచి నాలుగున్నర లక్షల మంది వీక్షించగా, 1800లకు పైగా కామెంట్లు రావడం విశేషం. పిల్లల సంగీత కచేరీ అద్భుతమని వారిద్దరికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 
 

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా