చిన్నోడి డాన్స్‌కి బాలీవుడ్‌ తార ఫిదా

24 Jan, 2020 09:23 IST|Sakshi

స్వతహాగా టాలెంట్‌ ఉంటే చాలు చేతిలో ఉన్న సోషల్‌ మీడియాతో ప్రపంచాన్ని చుట్టేయవచ్చు. ఒక్క వీడియోతో పావులర్‌ అయిన వారి సంఖ్యకు కొదవేలేదు. తాజాగా ఓ బుడ్డోడు వేసే స్ప్రింగ్‌ లాంటి స్టెప్పులకు బాలీవుడ్‌ తారాలు ఫిదా అవుతున్నారు. బాలీవుడ్‌ను ఉర్రూతలూగించిన పాటకు ఓ పదేళ్ల కుర్రాడు వేస్తున్న డాన్స్‌ పలువురిని ఫిదా చేస్తోంది. దీనిని బాలీవుడ్‌ నటి స్వరా భాస్కర్తో పాటు మరికొందరు ట్విటర్‌లో షేర్‌ చేశారు. లిటిల్‌ స్టార్‌ అంటూ కామెంట్స్‌తో ముంచెత్తుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా