ఈ బుడ్డోడికి ఎంత ధైర్యమో!

18 Jul, 2020 15:02 IST|Sakshi

చిన్న పిల్లలు ఏవరైనా సాధారణంగా పెద్ద పెద్ద జంతువులను చూస్తే భయపడి ఏడుస్తాడు.కానీ  సౌత్‌ ఆఫ్రికా అడవికి వెళ్లిన ఒక బుడ్డోడు మాత్రం ఏకంగా ఒక అడవి ఏనుగు దగ్గరకు వెళ్లి మరీ దాని తొండాన్ని తాకుతూ ‘హాయ్‌ ఎలిఫెంట్‌’ అని చెప్పి వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆఫ్రికా అడవులు అంటేనే అక్కడ సఫారీకి వెళ్లిన వారికి పెద్ద పెద్ద ఏనుగులు, రకరకాల అడవి జంతువులు కనబడటం సర్వసాధారాణం. అయితే సఫారీ గైడ్లు అడవి ఏనుగుల దగ్గరకు  పర్యాటకులను వెళ్లనివ్వరు. ఎందుకంటే అడవి జంతువులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియదు. 

చదవండి: వైరల్‌ వీడియో.. పాములతో కేక్‌ తినిపించారు

వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ లెసాన్నే ఫోలెర్, తన కొడుకుతో కలిసి సఫారీకి వెళ్లింది. అక్కడ ఓ పెద్ద అడవి ఏనుగు గడ్డి తింటుంటే లెసాన్నే దాన్ని ఫొటోలు తీయసాగింది. ఇంతలో ఆమె కొడుకు ఏమాత్రం భయపడకుండా ఏనుగు దగ్గరకు వెళ్లాడు. దాని తొండాన్ని నిమురుతూ... హాయ్ ఎలిఫేంట్ అని పలకరించాడు. ఇదంతా ఆమె వీడియో తీసింది. ఈ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంతనందా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం ఏంటంటే ఆ ఏనుగు ఏదో ధ్యాసలో ఉండి ఆ చిన్నారిని పట్టించుకోలేదు. అదే ఏనుగు కోపంలో ఉండి ఉంటే ఆ పిల్లాడికి పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ఈ వీడియో పోస్ట్‌ చేసిన సుశాంతనందా ఆ చిన్నారి తొండాన్ని నిమరడం ఏనుగుకి నచ్చి ఉంటుంది అని చెబుతున్నారు. 

ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అడవి జంతువుల దగ్గరకు చిన్నారులు వెళ్లడం మంచిది కాదని అంటున్నారు.  చిన్నారి తల్లి అలా వెళ్లనివ్వకుండా ఆపాలని సూచిస్తున్నారు. అదృష్టం కొద్దీ ఏం జరగలేదు కాబట్టి ఈ వీడియో చూసి ఎంజాయ్ చెయ్యగలుగుతున్నాం, అదే ఏమైనా అయి ఉంటే అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పక్కన ప్రొఫెషనల్స్ లేకుండా వన్యమృగాల దగ్గరకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. 

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా