రణు మొండాల్‌ను తలపిస్తున్న క్యాబ్‌ డ్రైవర్‌

16 Sep, 2019 17:05 IST|Sakshi

లక్నో: సాదాసీదా జీవితం గడుపుతున్న ఉబర్‌ క్యాబ్‌ డ్రైవర్‌ తనలోని అద్భుతమైన టాలెంట్‌తో ప్రయాణీకులను అబ్బురపరుస్తూ.. రణు మొండాల్‌ను తలపిస్తున్నారు. నిత్యం తన కారులో ప్రయాణించే వారిని క్యాబ్‌ డ్రైవర్‌ వినోద్‌ తన గానంతో అందరిని అలరిస్తున్నాడు. తాజాగా అతని కారులో ప్రయాణించిన ప్రియాంశు.. తాను అద్భుతంగా పాటలు పాడే ఓ డ్రైవర్‌ను కలిశానని, అతను సొంతంగా యూట్యూబ్‌  చానెల్‌ నిర్వహిస్తున్నాడని అతన్ని వెలుగులోకి తీసుకురావాలని ఉబర్‌ ఇండియాను కోరాడు. అంతేకాక 1990లో  హిట్టయిన 'ఆషికీ'  చిత్రంలోని 'నజర్‌ కే సామ్నే' అనే పాటను ఆలపిస్తున్న వీడియోను షేర్‌ చేశారు.

ప్రఖ్యాత గాయకుడు కుమార్‌ సాను పాడిన అలనాటి క్లాసిక్‌ పాటను తన గళంతో సుతిమెత్తగా ఆలాపిస్తూ.. సంగీత ప్రియుల హృదయాల్ని కొల్లగొడుతున్నాడు. 56 సెకన్లకు పైగా నిడివి ఉన్న ఈ వీడియోలో అతని గానాన్ని, గొంతులోని మాధుర్యాన్ని చూసి నెటిజన్లు తన్మయత్వంతో పులకరిస్తున్నారు. క్యాబ్‌ డ్రైవర్‌ వినోద్‌ తన అద్భుత గాన ప్రతిభతో ప్రయాణికులను మైమరిపిస్తూ..  తమ సంస్థ సామాజిక మాధ్యమాల్లోని పేజీల్లో  ప్రతినిత్యం వార్తల్లో  ఉంటున్నారని ఉబర్‌ ఇండియా సంస్థ యాజమాన్యం ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ వెబ్‌సైట్‌ ట్విటర్‌లో పేర్కొంది. 

మరిన్ని వార్తలు