మహానాయకుడు.. ఇంతకీ హీరో ఎవరు?

23 Feb, 2019 09:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానాయకుడు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ మహానేత తనయుడు, హీరో నందమూరి బాలకృష్ణ స్వయంగా నటించి, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రెండు పార్ట్‌లుగా విడుదల చేశారు. కథానాయకుడు బాక్సాఫిస్‌ వద్ద బోల్తా కొట్టడంతో... మహానాయకుడుపై మేకర్స్‌ ప్రత్యేక దృష్టి సారించి ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ వాస్తవ కథ కన్నా.. పార్టీ ప్రయోజనాలే ముఖ్యంగా భావించి ఈ చిత్రాన్ని తీయడంతో ఇది కూడా ప్రేక్షకులకు రుచించలేదు. కథకు మూలమైన నాయకుడి పాత్రను తగ్గించి మరోపాత్రకు ప్రాధాన్యత కల్పించడంతో అభిమానులు పెదవి విరుస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఈ చిత్రంపై తమదైన శైలిలో రివ్యూలిస్తున్నారు.

మొదటి భాగంలో సృజనకంటే భజన ఎక్కువై బోర్లాపడ్డ నేపథ్యంలో రెండో పార్ట్‌నైనా క్రిష్ బాగా తీస్తామనుకున్నామని, కానీ విలనీ భారమంతా నాదెండ్ల భాస్కరరావు నెత్తిన పెట్టేసి సినిమాను లాగించేసాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టడం ఘన విజయం సాధించడం ఆ తరువాత ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి మళ్లీ దాన్ని గెలుచుకోవడం అనేది స్టోరీ లైన్‌గా తీసుకున్న దర్శకుడు దాన్ని ప్రేక్షకుల మెదళ్లలోకి ఎక్కించలేకపోయాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఈ సినిమాలో హీరో ఎన్టీఆరా? లేక చంద్రబాబా? అని ప్రశ్నిస్తున్నారు. ఇంత మాత్రానికి ఈ సినిమా ఆ మహానాయకుడి కథ అని చెప్పడం దేనికి.. చంద్రబాబు బయోపిక్‌ అంటే సరిపోయేది కదా? అని వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. చంద్రబాబు.. ఎన్టీఆర్‌కే కాదు నందమూరి అభిమానులకు వెన్నుపోటు పొడిచారని కామెంట్‌ చేస్తున్నారు. ఇంకొందరైతే.. ఉరిశిక్షకు బదులు మహానాయుకుడు సినిమా చూపించాలని, సినిమాకు వెళ్లేవారు జండూబామ్‌ తీసుకెళ్లాలని ట్రోల్‌ చేస్తున్నారు.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా