ఓ ట్వీట్‌తో అడ్డంగా బుక్కయ్యాడు!

13 Jan, 2020 14:40 IST|Sakshi

సోషల్‌ మీడియాలో అసందర్భంగా కామెంట్‌ చేసిన ఓ వ్యక్తికి పుణె పోలీసులు గట్టి కౌంటర్‌ ఇచ్చారు. సాయం కోసం ప్రయత్నించిన మహిళ ఫోన్‌ నెంబర్‌ కావాలని అడగడంతో.. పోలీసులు అతనికి తమదైన శైలిలో జవాబిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ న్యాయ విధ్యార్థిని ధనోరి పోలీస్‌ స్టేషన్‌ నెంబర్‌ కావాలని ట్విటర్‌లో పూణె పోలీసులను కోరింది. దీనిపై స్పందించిన పూణె పోలీసు ట్విటర్‌ అధికార విభాగం.. ఆ మహిళకు ధనోరి పోలీస్‌ స్టేషన్‌ నెంబర్‌ను షేర్‌ చేశారు. అయితే ఇక్కడే ఓ నెటిజన్‌ పోలీసుల ట్వీట్‌కు స్పందిస్తూ.. ‘ప్లీజ్‌ నాకు ఆమె నెంబర్‌ ఇవ్వగలరా’ అని కామెంట్‌ చేశాడు.

అతను అలా కామెంట్‌ చేయడంపై పూణె పోలీసులు ఘాటుగా స్పందించారు. అతన్ని హెచ్చరించడంతో పాటు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘సార్‌, ప్రస్తుతం మీ నెంబర్‌ తెలుసుకోవడానికి మేము ఎక్కువ ఆసక్తిగా ఉన్నాం. ఎందుకంటే.. మహిళల నెంబర్లపై మీకు ఎందుకంతా ఆసక్తి ఉందో తెలుసుకోవాలని అనుకుంటున్నాం. మీ గోప్యతకు మేము గౌరవం ఇస్తాం. అందుకే మీకు డైరక్ట్‌ మేసేజ్‌ చేస్తాం’ అని పేర్కొన్నారు. మహిళల పట్ల చులకన భావం ప్రదర్శించిన సదరు నెటిజన్‌కు పోలీసులు గట్టి కౌంటర్‌ ఇవ్వడంతో.. వారిపై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. 

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భారీ హీరోల టీజర్‌లకు యూట్యూబ్‌ షాక్‌!

వైరల్‌ : నీ పాటికి పోతే! మా పరిస్థితి ఏంటి?

లీవ్‌ కోసం బాస్‌కు ఫేక్‌ ఫోటో.. పడిపడి నవ్వాల్సిందే

వైరల్‌: మహిళ కోసం కారును ఒట్టి చేతుల్తో..

ఫేక్‌ ఫొటో: డిటెన్షన్‌ సెంటర్లో తల్లి..

సినిమా

భారీ హీరోల టీజర్‌లకు యూట్యూబ్‌ షాక్‌!

అది వయొలెన్స్‌ కన్నా భయంకరం

సాయిధరమ్‌ తేజ్‌ గారు.. కంగ్రాట్యులేషన్స్ : పవన్‌

సరిలేరు సూపర్‌హిట్‌: థాంక్స్‌ చెప్పిన మహేశ్‌

ఉదిత్‌ నారాయణ్‌ కోడలు కాబోతున్న సింగర్‌!

అల.. తొలిరోజు భారీ కలెక్షన్స్‌