పిల్లాడిపై అమానుష చర్యకు పాల్పడ్డ వ్యక్తి

22 May, 2019 16:36 IST|Sakshi

చిన్న పిల్లాడనే కనికరం లేకుండా.. ఓ వ్యక్తి బాలుడి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. అతడిని అమాంతం ఎత్తి పడేస్తూ కర్కషంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగక కిందడేసి తొక్కుతూ బాలుడికి నరకం చూపించాడు. ఈ అమానుష చర్యకు సంబంధించిన వీడియోను నటి లక్ష్మీ రామకృష్ణన్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘ అసలేంటిది. చూడలేకపోతున్నా!!! ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లిందా లేదా? ఈ అమానుష చర్యను ఆపకుండా అక్కడున్న స్త్రీ వీడియో తీయడమేంటి? పోలీసులు కేసు రిజిస్టర్‌ చేశారా’ అంటూ లక్ష్మీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా లక్ష్మీ ట్వీట్‌పై స్పందించిన నెటిజన్లు...మరీ ఇంత రాక్షసత్వమా అంటూ వీడియోలలో ఉన్న వ్యక్తిపై మండిపడుతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇది దాదాపు సంవత్సరం క్రితం జరిగిన ఘటన అని, పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేసి ఉంటారని పేర్కొంటున్నారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 

మరిన్ని వార్తలు