వ్యక్తి అత్యుత్సాహం, పులితో ఆటలు..దాంతో!

21 Aug, 2019 10:42 IST|Sakshi

కోల్‌కత : ‘పులితో సెల్ఫీ దిగాలనుకుంటే కొంచెం రిస్క్‌ అయినా ఫరవాలేదు. ట్రై చేయొచ్చు. కానీ చనువిచ్చింది కదా అని దాంతో ఆడుకోవాలని చూస్తే.. వేటాడేస్తది’ ఇది యమదొంగ సినిమాలో యంగ్‌ టైగర్‌ జూ.ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ప్రమాదం తప్పదనే హెచ్చరిక అది. పశ్చిమ బెంగాల్‌లో ఓ వ్యక్తి అలాంటి పనే చేశాడు. రోడ్డు దాటుతుండగా ప్రమాదం బారిన పడ్డ చిరుతతో ఆటలకు దిగాడు. దాని దగ్గరగా వెళ్లి ఫొటోలు తీద్దామనుకున్నాడు. ఇంకేముంది..! అసలే గాయాలతో ఉన్న ఆ చిరుత ఒక్కసారిగా అతనిపై దాడిచేసింది.

చచ్చాన్రా దేవుడా అనుకుంటూ అక్కడున్న మిగతావారు పరుగు లంకించుకున్నారు. అయితే, అప్పటికే  గాయాలతో చిరుత నీరసించిపోవడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. మొహం, వీపుపై సదరు వ్యక్తికి గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ చిరుతను జల్దపర నేషనల్‌ పార్క్‌ అధికారులు సంరక్షించారు. దాని కుడి కాలు, తలకు గాయాలయ్యాయని, ట్రీట్‌మెంట్‌ అనంతరం అడవిలో వదిలిపెడతామని వెల్లడించారు. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్లాన్‌ అదిరింది కానీ, బెడిసి కొట్టింది!

వైరల్‌ : ప్రిన్స్‌ చార్లెస్‌తో కనికా..

చైనీస్‌ ఫుడ్‌ కావాలంటూ ఒక్కటే ఏడుపు!

‘వైద్య సిబ్బంది లాక్‌డౌన్‌ చేస్తే.. మీ పరిస్థితి ఏంటి?’

సామజవరగమనా, నేనిల్లు దాటగలనా!

సినిమా

కుకింగ్‌.. క్లీనింగ్‌

రుచి...వాసన తెలియడంలేదు

పిల్లలు పస్తులు ఉండకూడదు

కరోనా దగ్గర చేసింది!

నా ఇంటిని ఆస్పత్రిగా మార్చండి

కరోనాపై వార్‌ : ప్రభాస్‌, ఎన్టీఆర్‌ భారీ విరాళం