వైరలవుతోన్న కస్టమ్స్‌ అధికారి స్టోరి

5 Apr, 2019 18:42 IST|Sakshi

స్మగ్లింగ్‌ నుంచి నియంత్రించడానికి ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతున్న మాట వాస్తవం. ముఖ్యంగా విమానాశ్రయల్లో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. మనం కూడా నిత్యం ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టివేత వంటి వార్తల్ని అనేకం చూస్తూనే ఉంటాం. అయితే కస్టమ్స్‌ అధికారుల కళ్లుగప్పడానికి జనాలు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తారో చెప్పుకొచ్చారు ఓ సీనియర్‌ కస్టమ్స్‌ అధికారి. ఓ వ్యక్తి ఏకంగా వేరు శనకాయల్లో డ్రగ్స్‌ని కుక్కి స్మగుల్‌ చేయడానికి ప్రయత్నించాడని గుర్తు చేసుకున్నారు

నార్‌బర్ట్‌ అల్మేడియా అనే వ్యక్తి 2000 - 2005 వరకూ కస్టమ్స్‌ అధికారిగా విధులు నిర్వహించాడు. అయితే ఏ దేశంలో అనే వివరాలు పేర్కొనలేదు. ఈ క్రమంలో జనాలు ఎలాంటి వస్తువులను ఎక్కువగా స్మగుల్‌ చేయడానికి ప్రయత్నించేవారు.. అందుకు ఏలాంటి మార్గాన్ని ఎంచుకునేవారో తెలిపారు.  స్మగ్లింగ్‌కు గురయ్యే వాటిల్లో ఎక్కువగా తాబేళు పిల్లలు, తేళ్లు, ఆహార పదార్థలతో పాటు డ్రగ్స్‌ను కూడా ఉండేవని తెలిపారు. అయితే వీటన్నింటిలో డ్రగ్స్‌ని తరలించడం కోసం జనాలు రకరకాల ప్రయత్నాలు చేసేవారని గుర్తు చేసుకున్నారు. కార్పెట్‌ను డ్రగ్స్‌లో ముంచి తీసుకురావడం.. కంప్యూటర్లలో డ్రగ్స్‌ను నింపి పైన ఉత్త గ్లాస్‌ను అంటించడం.. ఆఖరికి సూట్‌కేస్‌లు, వీల్‌ చైర్లలో కూడా డ్రగ్స్‌ను తరలించడానికి ప్రయత్నించేవారు అని తెలిపారు.

అయితే వీటన్నింటికి కన్నా ఆసక్తికర సంఘటన ఒకసారి చోటు చేసుకుందని తెలిపారు. ఒక వ్యక్తి వేరు శనక్కాయల లోపల డ్రగ్స్‌ను కుక్కి స్మగ్లింగ్‌ చేయడానికి ప్రయత్నించాడు. అతన్ని అరెస్ట్‌ చేసినప్పటికి కూడా అతని సృజనాత్మక ఆలోచనని మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాను అని పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఈ స్టోరీ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. డ్రగ్స్‌ని వేరు శనక్కాయల్లో తరలించే ఆలోచన వచ్చినందుకు సదరు వ్యక్తికి ఆస్కార్‌, నోబల్‌ కన్నా ఉత్తమ అవార్డు ఇవ్వాలి అని.. ఇలాంటి పనుల కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం బుర్రను వాడితే మంచిదని కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు.

మరిన్ని వార్తలు