వైరల్‌ వీడియో.. ఆగ్రహం వ్యక్తం చేసిన నమ్రత

12 Dec, 2018 11:16 IST|Sakshi

అతిపెద్ద ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రముఖ నటి, టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌. విషయం ఏంటంటే గత రెండు రోజులుగా జొమాటోకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ.. జొమాటో డెలివరీ బాయ్‌ ఒకరు కస్టమర్‌ ఆర్డ్‌ర్‌ చేసిన ఫుడ్‌ని కొద్దిగా తిని.. తిరిగి ప్యాక్‌ చేసి డెలివరీ చేశాడు. అయితే సదరు డెలివరీ బాయ్‌ నిర్వాకం అంతా అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యింది. ఇంటర్నెట్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో తెగ వైరలవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు జొమాటోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా కోప్పడిన వారిలో నమ్రత కూడా ఉన్నారు.

ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన నమ్రత.. ‘ఇంత పేరున్న ఫుడ్‌ డెలివరీ సంస్థ పనితీరు చూసి నేను చాలా షాక్‌కి గురయ్యాను. ఫుడ్‌ ఆర్డర్‌ చేసేవారు కనీస శుభ్రతను ఆశిస్తారు. కానీ ఈ వీడియో చూసిన తరువాత ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేయాలంటేనే భయం వేస్తోంది. ఒక వేళ ఆర్డర్‌ చేయాల్సి వచ్చిన ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆర్డర్‌ చేయాలని భావిస్తున్నాను​. నా పిల్లలను ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేయనివ్వను.. మీకూ ఇదే చెప్తున్న’ అంటూ కామెంట్‌ చేశారు. సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియోను లక్షల మంది చూశారు.

It's really shocking how these reputed food delivery companies are functioning. People order food online expecting basic hygiene and this is how it is delivered?!!?! What about the work ethics of these delivery boys?? Looks like its time to think twice before opening that app & placing the order. I am definitely not gonna encourage my kids to order food online, I suggest even you guys don't! #thisisNOTCOOL

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

సోషల్‌ మీడియాలో విమర్శలు పెరగడంతో దిద్దుబాటు చర్యలకు దిగింది జొమాటో. ఈ సంఘటన మధురలో జరిగిందని.. సదరు డెలివరీ బాయ్‌ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు ప్రకటించింది. అనంతరం కస్టమర్లకి క్షమాపణలు చెప్పడమే కాక ఇక మీదట ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తానంది. అంతేకాక ఫుడ్‌ ప్యాకింగ్‌ కోసం త్వరలోనే ట్యాంపర్‌ ప్రూఫ్‌ టేప్స్‌ని తీసుకొస్తామని తెలిపింది.

మరిన్ని వార్తలు