వైరల్‌: ఆత్మ నిర్భన్‌పై నెటిజన్ల స్పందన

13 May, 2020 16:08 IST|Sakshi

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించిన తర్వాత ఓ పదం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఆత్మ నిర్భర్‌’ అంటే అర్థం ఏంటో చెబుతూ నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ‘ఆత్మ నిర్భర్’‌ అంటే ‘స్వయంగా వంట చేసుకోవడం’  ‘మన పని మనం చేసుకోవడం’  అంటూ కొంత మంది కామెంట్స్‌ చేయగా.. మరికొందరూ ‘కొడుకును ఓ తల్లి నువ్వు పెళ్లి ఎప్పడూ చేసుకుంటావ్‌ అని అడిగిన ప్రశ్నకు.. కొడుకు అమ్మ నేను అత్మనిర్భర్‌’ అని బదులు ఇచ్చినట్లుగా నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌ షేర్‌ చేస్తున్నారు. ‌మరోక ట్విటర్‌ యూజర్‌ ‘నేను నా పబ్‌జీ పేరు ఆత్మనిర్భర్‌గా మారుస్తాను.. ఇప్పుడు చూడండి నా బృందం నాకు మద్దతు ఇవ్వదు’ అంటూ సరదాగా కొత్తకొత్తగా అర్థాలు వెతుకుతున్నారు. (ప్రధాని ప్రసంగం.. అర్థం ఏంటో!)

ఇక ‘మా పెంపుడు పిల్లి పాండియన్‌ను చూడండి. అది టాయిలేట్‌ వస్తే బాత్‌రూంకు వెళ్లడానికి శిక్షణ తీసుకుంది. అంటే ప్రధాని మోదీ ‘ఆత్మనిర్భర్’గా ఉండాలని చెప్పక మునిపే పాండియన్‌ ‘ఆత్మనిర్భర్’‌గా ఉండటానికి చాలా కష్టపడుతున్నాడు’ అంటూ నెటిజన్లు తమదైన శైలిలో అర్థాలు వెతుకుతున్నారు. కాగా దేశ వ్యాపంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌’ పేరిట రూ.20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. ఆత్మ విశ్వాసం, ఆత్మ బలంతో ప్రజలు ఉండటమే కాకుండా ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ అనేది దేశ ప్రజల నినాదం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు