ప్రాణం మీదకు తెచ్చిన అత్యుత్సాహం

9 Aug, 2019 15:36 IST|Sakshi

‘అత్యుత్సాహం ప్రాణ సంకటం’ అనే సామెత ఈ పిల్లి విషయంలో నిజం అయ్యింది. ఓ పెంపుడు పిల్లి ఒపెన్‌ చేసి ఉన్న స్విచ్‌ బోర్డులో తల పెట్టడంతో కరెంట్‌ షాక్‌ కొట్టింది. షాక్‌కి దాని వెంట్రుకలు నిటారుగా అయిపోయాయి. దాంతో కార్టున్‌ క్యారెక్టర్‌ను తలపించేలా ఉన్న ఈ పిల్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. ఏం జరిగిందో అర్థం కాక అమాయకంగా చూస్తున్న పిల్లి ఫోటోలను చూసి నెటిజనులు పడి పడి నవ్వుతున్నారు. ఉరాకువా అనే ట్విటర్‌ యూజర్‌ షేర్‌ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం తెగ ట్రెండ్‌ అవుతున్నాయి.

‘ఒపెన్‌ చేసి ఉన్నస్విచ్‌ బోర్డులను ముట్టుకోవద్దని.. ముట్టుకుంటే ఈ పిల్లిలాగే కరెంట్‌ షాక్‌ కొడుతుంది’ అని ఉరాకువా ట్వీట్‌ చేసింది. ఇదివరకే ఈ పిల్లి ఫోటోలు మే నెలలో ఆన్‌లైన్‌ వచ్చినప్పటికి .. గురువారం తాజాగా ఉరాకువా మళ్లీ వీటిని షేర్‌ చేయడంతో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఉరాకువా ‘పిల్లి ప్రాణం తీసిన ఉత్సాహం’  అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ ఫోటోలకు ఇప్పటి వరకు 13 వేల లైక్‌లు.. వందల్లో కామెంట్లు వచ్చాయి.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు