ప్యాంట్స్‌ లేకుండా లైవ్ రిపోర్టింగ్‌..

29 Apr, 2020 19:13 IST|Sakshi
లైవ్‌ రిపోర్టింగ్‌ చేస్తున్న రీవ్‌

ప్యాంట్స్‌ లేకుండా వార్తలు చదివిన ఏబీసీ న్యూస్‌ రిపోర్టర్‌

లాక్‌డౌన్‌ కారణంగా వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్న కొందరు ఇంటి దగ్గరనుంచి పని చేయటమే కాదు.. అప్పుడప్పుడు తప్పులు చేసి, నవ్వులు కూడా పూయిస్తున్నారు. తాజాగా ఓ యాంకర్‌ వర్క్‌ఫ్రమ్‌ హోం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. లైవ్‌లోకి వచ్చిన అతను ప్యాంట్స్‌ వేసుకోకపోవటంతో న్యూస్‌ ప్రోగ్రామ్‌ కాస్తా.. కామెడీ ప్రోగ్రాంగా మారింది. వివరాలు.. ఏబీసీ న్యూస్‌లో పని చేసే రీవ్‌ అనే న్యూస్‌ రిపోర్టర్‌ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నాడు. కొద్దిరోజులక్రితం లైవ్‌ ఇవ్వటానికి కెమెరా ముందుకు వచ్చి కూర్చున్నాడు. ప్రేక్షకులను విష్‌ చేసి వార్తలు చదవటం మొదలుపెట్టాడు. అయితే సూట్‌ వేసుకున్న రీవ్‌, దాని కింద ప్యాంట్స్‌ వేసుకోలేదు. ( వైరల్: ఈ‌ మెసేజ్‌ చదవాలంటే మీ ఫోన్‌ను.. )  

దీంతో ఈ కార్యక్రమాన్ని లైవ్‌ చూసిన వాళ్లలో కొందరు ఇందుకు సంబంధించిన వీడియోలను, స్ర్కీన్‌ షాట్లను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసేశారు. అంతేకాకుండా దీనిపై సందిస్తున్న కొందరు నెటిజన్లు.. ‘‘ చక్కనైన గది.. చక్కనైన నిక్కరు.. వాడు రిపోర్టర్‌రా బుజ్జీ..’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

చదవండి : ( ఆన్‌లైన్ పెళ్లి; ఫోన్‌కు తాళి క‌ట్టాడు )

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు