1,00,000 గ్రాఫిక్‌  డిజైనర్లు

23 Mar, 2019 08:39 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఎన్నికల నేపథ్యంలో మార్కెట్లోకి పలు సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులోకి వచ్చాయి. వ్యక్తిగత ప్రచారానికి, వైరి పక్షాన్ని ఇబ్బంది పెట్టేలా గ్రాఫిక్స్‌తో ఫోటోలను రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు లక్ష మందికిపైగా గ్రాఫిక్‌ డిజైనర్లు పనిచేస్తున్నట్టు సమాచారం. దాదాపు 1.60 కోట్ల మంది ఎలక్షన్‌ ట్రెండ్‌ను సోషల్‌ మీడియా ద్వారా అనుసరిస్తున్నారు. వీరి ద్వారా సమాచారం మరో 1.20 లక్షల మందికి చేరుతోంది. వీరికి ఫేస్‌బుక్, ట్విట్టర్లకు 1.10 కోట్ల మంది, వాట్సాప్‌ గ్రూపుల్లో 50 లక్షల మంది లింక్‌ అయినట్టు తెలుస్తోంది. గ్రూపులు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి కాబట్టి కచ్చితంగా అంచనా వేయలేమని సర్వే సంస్థ పేర్కొంది. విషయాలను తెలుసుకునేందుకు ప్రధానంగా ఫేస్‌బుక్‌కు కనెక్ట్‌ అవుతున్నారు. ప్రధాన పార్టీలు, నేతల మనోగతాన్ని తెలుసుకునేందుకు ట్విట్టర్‌ అకౌంటును క్లిక్‌ చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు