సోషల్‌ మీడియా

2 Sep, 2018 01:35 IST|Sakshi

ట్రెండీగా ఉండాలంటే...
‘‘ఇదివరకు ఎన్నడూ ప్రయత్నించని పని చేయాలనుకున్నాను. రుచికా సలహా మేరకు ఇలా ట్రెండీగా తయారయ్యాను. అయితే నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నట్లుగా నేను వాడింది ఎరుపు రంగు కాదు. అది బర్గండీ. ఏది ఏమైనా ఇష్టమైన హెయిర్‌ సై్టల్‌ మెయింటెయిన్‌ చేయాలంటే ఎవరికైనా చాలా ఓపిక ఉండాలి. ఈరోజు నాకు ఆ ఓపిక వచ్చేసింది’’ – పరిణీతి చోప్రా బాలీవుడ్‌ నటి

హాకీపై పంజాబీ ముద్ర
‘‘ఆసియా క్రీడల్లో దాయాది పాకి స్తాన్‌ను మట్టి కరి పించిన భారత్‌ హాకీ జట్టుకి అభినంద నలు. కాంస్య పతకాన్ని సాధించిన ఈ జట్టులో ఎనిమిది మంది క్రీడాకారులు పంజాబ్‌కు చెందిన వారు కావడం మాకెంతో గర్వకారణం’’ – కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ పంజాబ్‌ ముఖ్యమంత్రి

కెప్టెన్‌ వైఫ్‌
‘భార్యా భర్తలు కెప్టెన్‌లుగా నడుపు తున్న విమానంలో ప్రయాణిస్తున్నాం. వాళ్లిద్దరూ ప్రయాణం మధ్యలో ఎలాంటి గొడవ పెట్టుకోకూడదని కోరుకుంటున్నాను. ఈరోజు భార్య ఫస్ట్‌ కెప్టెన్‌అయితే బహుశా గొడవ ఉండకపోవచ్చు’’ – సాక్షి సింగ్, టీమిండియా మాజీ కెప్టెన్‌ «ధోనీ సతీమణి

శిఖరస్థాయి ప్రదర్శన
‘‘కొన్ని ఇన్నింగ్స్‌లు ఉన్నత స్థానానికి తీసుకెళతాయి. అలాంటిదే పుజారా ఇన్నింగ్స్‌. ఇషాంత్, బుమ్రాలను కలుపుకుని పుజారా 75 పరుగులు  జత చేయడం క్రికెట్‌ ప్రేమికులకు చాలా రోజులు గుర్తుండిపోతుంది. ఇక ఇప్పుడు రాణించడం భారత బౌలర్ల వంతు’’ – వీరేంద్ర సెహ్వాగ్‌ టీమిండియా మాజీ క్రికెటర్‌

ఇంటి ముంగిటకు తపాలా
‘‘భారత్‌ తపాలా బ్యాంకులు గ్రామీణ ప్రజలకు ఒక వరం. ఇక నుంచి గ్రామీణ ప్రాంత ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరగ నక్కర్లేదు. తపాలా బ్యాంకే వారి ఇంటి ముంగిటకు వస్తుంది. పోస్టుమ్యాన్‌ ఇల్లిల్లు తిరుగుతూ ఆర్థిక సేవలు అందిస్తాడు. ఒకప్పుడు తపాలా శాఖను నిర్వహించిన వ్యక్తిగా నేను గత స్మృతుల్లో తేలియాడుతున్నాను. –  రవిశంకర్‌ ప్రసాద్, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హవ్వా.. అనుష్కా లెజెండా?

పంచాయతీ ఎన్నికలు.. ‘సోషల్‌’ పోరు మొదలైంది

‘స్టుపిడ్‌.. బుద్ధి లేదా.. అదేం పని?’

బాబు నోట భలే మాట!

వావ్‌.. బాటిల్‌ని ఇలా కూడా వాడొచ్చా?!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అప్పుడు చాలా బాధనిపించింది’

తల్లికి తగ్గ తనయ

డేట్‌ ఫైనల్‌

నన్ను హౌస్‌ అరెస్ట్‌ చేశారు

ఇస్మార్ట్‌ గాళ్‌ ఇన్‌?

కనుక్కోండి చూద్దాం