‘రిజర్వ్‌’ నిధులు

27 Jan, 2019 00:53 IST|Sakshi

‘రిజర్వ్‌’ నిధులు
‘‘నరేంద్ర మోదీ ప్రభుత్వం మళ్లీ రిజర్వ్‌బ్యాంక్‌ మూలధనంపై కన్నేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ విశ్వసనీయతకు, మన కరెన్సీకి సుస్థిరతకు ఆర్‌బీఐ దగ్గర ఈ నిల్వ అవసరం. ఈ విషయంలో ప్రభుత్వ ఒత్తిళ్లతో ఇప్పటికే అసాధారణ రీతిలో ఇద్దరు గవర్నర్లు నిష్క్రమించారు. అయినా కేంద్ర ప్రభుత్వం దీన్నుంచి ఏమీ నేర్చుకోలేదని అర్ధమవుతోంది’’
– సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి (‘రిజర్వ్‌’ నిధులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కన్నేసిందన్న కథనం చూశాక)

వివేకం కలగాలి
‘‘
ఈ ఏడాది రిపబ్లిక్‌ డే సందర్భంగా అన్ని విధాలా అర్హులైన వారికి విశిష్ట పురస్కారాలు ప్రకటిస్తే కొందరు దీన్ని రాజకీయం చేయడానికి పూనుకోవడం బాధాకరం. ఆ బాపతు వారికి ఆ భగవంతుడే వివేకం కలిగించాలి. అందుకు వారిని అనుగ్రహించాలి’’ – జీవీఎల్‌ నరసింహారావు బీజేపీ అధికార ప్రతినిధి

ద్వంద్వ ప్రమాణాలు
‘‘బ్లాగ్‌ మంత్రి’ అరుణ్‌ జైట్లీ త్వరితంగా కోలు కోవాలని ఆకాంక్షి స్తూనే చందా కొచ్చ ర్‌పై ఆయన  చేసిన ప్రకటనను తప్పుబట్టక తప్పడం లేదు. అది అసాధారణమైనది. మరోరకంగా ఐసీఐ సీఐ కేసులో అడుగు ముందుకేయొద్దని సీబీఐని కోరడమే. ఇలాంటి ద్వంద్వ ప్రమా ణాలు సరికాదని ఆయన గుర్తించాలి’’ – జైరాం రమేష్, కాంగ్రెస్‌ నాయకుడు

అత్యున్నత విలువ
‘‘మీకు రిపబ్లిక్‌ డే శుభాకాంక్షలు. సరిగ్గా ఇదే రోజు ఆవిష్కృత మైన మన రాజ్యాంగం మీ తల్లిగారికి, ఆమె లాంటి అనేకులకు ఒక నిరర్థక హామీ పత్రంగా మిగిలి ఉండొచ్చు. కానీ ఇప్పటికీ మనం నిలబెట్టుకునేందుకు పోరాడి తీరవ లసిన ఏకైక ఆదర్శం అదొక్కటేనని మీరు గుర్తించండి’’  – సంజయ్‌ హెగ్డే సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది

పతాక విలువలు
‘‘సమాజంలో చీలికలు విస్తరిస్తుంటే, విద్వేషాలు భయంకరంగా రేగుతుంటే మన త్రివర్ణ పతాకం వినువీధిలో రెపరెపలాడుతూ మనలో విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగిస్తోంది. తన అత్యున్నత విలువలు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందుకోమని మనందరికీ పిలుపునిస్తోంది’’     – సాగరికా ఘోష్, సీనియర్‌ జర్నలిస్టు (గణతంత్ర దినోత్సవం సందర్భంగా)
 

మరిన్ని వార్తలు