సోషల్‌ మీడియా

31 Jan, 2019 00:35 IST|Sakshi

బుల్లెట్స్‌
‘‘జాతిపిత మహాత్మాగాంధీ నుంచి కర్ణాటకకు చెందిన జర్నలిస్టు గౌరీ లంకేష్‌ వరకూ హంతకుల బుల్లెట్లు క్రూర త్వాన్నే ప్రదర్శించాయి. అయినా వ్యవస్థపై మా ప్రతిఘటన ధైర్యంగా కొనసాగింది. వారి బుల్లెట్లు హతమార్చడాన్ని, విడదీయడాన్నీ లక్ష్యంగా చేసుకున్నాయి. అసమ్మతినీ, వైవిధ్యాన్నీ, ప్రజాస్వామ్యాన్ని నిలుపుకోవడం కోసమే మా ఈ పోరాటం’’ – ఉమర్‌ ఖలీద్‌ విద్యార్థి నాయకుడు

అనుసరణ
‘‘కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ ఒకరినొకరు అనుసరిస్తున్నారా? పడిపోయిన కెమెరామన్‌కు రాహుల్‌ సహాయం చేసిన మరుసటి రోజే, సూరత్‌లో స్పృహ కోల్పోయిన వ్యక్తిని మోదీ కూడా అలాగే ఆదుకోవడం విడ్డూరం’’ – సునేత్ర చౌదరి ఎన్‌ డీటీవీ పొలిటికల్‌ ఎడిటర్‌

ప్రశ్న
‘‘రాహుల్‌ గాంధీ ప్రకటించిన కనీస వేతన హామీ పథకంపై డబ్బులు ఎలా వస్తాయి, తీరుతెన్ను లేమిటంటూ అనేక మంది ప్రశ్నలు లేవనెత్తడం ఆరోగ్యకరం, ఆనందకరం. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తున్న హామీల గురించి కూడా ఇలాగే ప్రశ్నించాలని ఎవరైనా, ఎప్పుడైనా అనుకున్నారా?’’ – అజయ్‌ కామత్, నేత్ర వైద్యుడు

దొంగలు
‘‘ఢిల్లీలోని ఖాన్‌ మార్కెట్‌లో చిల్లర దొంగతనాల గురించి చాలాసార్లు విన్నాను. అక్కడి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట జర్నలిస్ట్‌ నిధి తండ్రి మొబైల్‌ఫోన్‌ అపహరణకు గురైనా పట్టించుకునే నాథుడే లేడు. ఓ ఏడాది క్రితం అదే ప్రాంతంలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నాయకురాలు షెహ్లా రషీద్‌కు కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. అక్కడ సుమారు పది సీసీటీవీ కెమెరాలు ఉన్నా... ఢిల్లీ పోలీసులు ఈ దుశ్చర్యలను ఎందుకు నిలువరించలేకపోతున్నారు? దొంగలను ఎందుకు పట్టుకోలేకపోతున్నారో నాకు అర్థం కావటం లేదు?’’ – తహ్సీన్‌ పూణావాలా కాలమిస్ట్‌

పండుగ
‘‘గాంధీజీపై దాడిని హిందూ మహాసభ సెలబ్రేట్‌ చేసుకుంది. ఉగ్ర వాద దాడులను ముస్లింలు సెలబ్రేట్‌ చేసుకోగా నేనెప్పుడూ చూడలేదు. భారతదేశంపట్ల విశ్వసనీయత గురించి ముస్లింలనే ఎందుకు ప్రశ్నిస్తారు?    – ప్రశాంత్‌ కనోజియా, ద వైర్‌ జర్నలిస్ట్‌ 

మరిన్ని వార్తలు