సోషల్‌ మీడియా

6 Nov, 2018 01:01 IST|Sakshi

సొమ్మెవరిది?
‘‘మొదట ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన 597 అడుగుల సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహం నిర్మించారు, తర్వాత ముంబైలోని సముద్ర తీరాన 696 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం నిర్మిస్తామన్నారు. ఇప్పుడు తాజాగా అయోధ్యలో 495 అడుగుల రాముని విగ్రహం నిర్మిస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ అంటున్నారు. మీరు, నేను చెల్లించే ట్యాక్స్‌లన్నీ ఈ భారీ విగ్రహాల కోసమేనా?’’ – ప్రీతిష్‌ నంది, జర్నలిస్ట్‌

మారిన హామీలు
‘‘నాలుగేళ్ల క్రితం అధికారం చేపట్టినప్పుడు అభివృద్ధి, ఉద్యోగాల పేరు చెప్పారు. ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తామన్నారు. ఐదేళ్లు గడిచిపోయినా ఏమీ జరగలేదు. ఇప్పుడు భారీ దేవాలయాలు నిర్మిస్తామని, పెద్దపెద్ద విగ్రహాలు నెలకొల్పుతామని హామీలిస్తున్నారు’’ – చిదంబరం,కేంద్ర మాజీ మంత్రి

బెగ్గింగ్‌ కాదు
‘‘పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చైనా పర్యటనలో  చేసిన ప్రసంగాన్ని ప్రసారం చేయడంలో పొరపాటు దొర్లింది. డేట్‌ లైన్‌ బీజింగ్‌ బదులు బెగ్గింగ్‌ అని  తప్పుగా వచ్చింది. ఇది తెరపై 20 సెకన్లపాటు కనబడింది. తర్వాత తొలగించారు. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నాం’’ – పీటీవీ న్యూస్‌

మూగబోయిన మోదీ!
‘‘ఢిల్లీలో రాజకీయ అత్యవసర పరిస్థితిపై ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? దేశరాజధానిలో కాలుష్యంతో  జనం తల్లడిల్లుతుంటే అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్రప్రభుత్వం పరస్పరం నిందించుకోవడంతో సరిపెట్టుకోవటం దారుణం.  కాలుష్యాన్ని పరిష్కరించడం ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన అంశం కాగా, ప్రధాని స్వచ్ఛభారత్‌ గురించి మాట్లాడటం  సమంజసమేనా? ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ముద్రపడిన ఢిల్లీ సమస్యకు మోదీ చూపే పరిష్కారం ఏమిటి?’’ – అభిషేక్‌ మను సింఘ్వి
కాంగ్రెస్‌ ప్రతినిధి

ఇదీ లెక్క
‘‘గాంధీ కుటుంబ సభ్యుల పేరు మీద 11 కేంద్ర, 52 రాష్ట్ర పథకాలు, 19 స్టేడియాలు, 5 ఎయిర్‌పోర్ట్‌లు, 10 విద్యా సంస్థలు, 17 అవార్డులు, 9 స్కాలర్‌షిప్‌లు, 10 ఆసుపత్రులు ఉన్నాయి. కానీ, పటేల్‌ విగ్రహమే వారికి సమస్యగా మారింది’’      – రవి శంకరప్రసాద్, కేంద్ర మంత్రి
 

మరిన్ని వార్తలు