పిచ్చి పీక్స్‌కు వెళ్లడం అంటే ఇదే..!

18 Apr, 2019 09:10 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : ప్రపంచంలో పాకిస్తాన్‌ రిపోర్టర్లు చేసినంత వెరైటీ రిపోర్టింగ్‌ వేరే ఎవరూ చేయరేమో. గాడిదల జనాభా పెరిగిపోతుందని చెప్పడం కోసం ఓ జర్నలిస్ట్‌ ఏకంగా గాడిద మీద కూర్చోని రిపోర్టింగ్‌ చేసిన సంఘటన మరువక ముందే.. అలాంటి మరో సంఘటన చోటు చేసుకుంది. వరద తీవ్రత గురించి చెప్పడానికి ఈ జర్నలిస్ట్‌ ఏకంగా ఆ ప్రవాహంలో నిల్చోని రిపోర్టింగ్‌ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది.

నైలా ఇనయత్‌ అనే ట్విటర్‌ యూజర్‌ పోస్ట్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ నవ్వులు పూయిస్తోంది. దీనికి నైలా ‘ప్రొడ్యూసర్‌ వేరే ఏ చానెల్‌ రిపోర్ట్‌ చేయని న్యూస్‌ స్టోరీని తీసుకురా అని ఆదేశించాడు. పాపం అందుకే ఇలా’ అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ‘వరదలో నువ్వు కూడా కొట్టుకుపోతే అప్పుడు నీ గురించి రిపోర్ట్‌ చేయాల్సి వస్తుంది’. ‘ఇలాంటి తలకు మాసిన ఆలోచనలు ఎలా వస్తాయో’.. ‘పులిట్జర్‌ ప్రైజ్‌ ఇవ్వాల్సిన రిపోర్టింగ్‌’ ఇది అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు. గతంలో ఓ జర్నలిస్ట్‌ గాడిదపై కూర్చుని రిపోర్టింగ్‌ చేయడం.. అది కాస్తా అతన్ని కింద పడేయడం అందరికి తెలిసిందే.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు