విమానంలోకి పావురం ఎలా వచ్చిందో!

29 Feb, 2020 13:21 IST|Sakshi

అహ్మదాబాద్‌ : ఎయిర్‌గోకు చెందిన జి8702 విమానం అహ్మదాబాద్‌ నుంచి జైపూర్‌ వెళ్లడానికి సిద్దంగా ఉంది. సరిగ్గా టేకాఫ్‌ తీసుకుంటున్న సమయంలో ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు గానీ ఓ పావురం విమానంలోని ప్రయాణికులను ముప్పతిప్పలు పెట్టింది. ప్రయాణికులకు దొరకకుండా పావురం అటూ ఇటూ ఎగురుతూ తెగ హల్‌చల్‌ చేసింది. కాగా ప్రయాణికులు పావురం చేసిన పనిని ఆనందిస్తూనే తమ సెల్‌ఫోన్లలో వీడియోలు తీశారు. అయితే ఒక వ్యక్తి మరింత ఉత్సాహంతో పావురాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. (ఆ చిన్నోడి కోసం 4 లక్షల డాలర్లు.. ఏం చేస్తారంటే..)

అయితే ఈ విషయాన్ని క్యాబిన్‌ క్రూ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి విండో క్యాబిన్‌ ఓపెన్‌ చేసి పావురాన్నిబయటకు పంపించారు. దీంతో 6.15 గంటలకు బయలుదేరాల్సిన విమానం 30 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరి 6.45 గంటలకు జైపూర్‌కు చేరుకుంది. అయితే ఇదంతా సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. అప్పుడప్పుడు విమానంలోకి పక్షులు రావడం సహజమే. ఒక్కోసారి అవి అయోమయంతో చేసే పనులు విమానం క్రాష్‌కు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయని వీడియో చూసిన నెటిజన్లు​ వ్యాఖ్యానిస్తున్నారు.('తాజ్‌ అందాలు నన్ను మైమరిపించాయి')

మరిన్ని వార్తలు