‘ఎమిలీ’ గానానికి నెటిజన్లు ఫిదా

8 Aug, 2019 17:19 IST|Sakshi

ముంబై: ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా పుణ్యాన ఇన్నాళ్లు వెలుగులోకి రాని ప్రతిభావంతుల గురించి ప్రపంచానికి తెలియడం.. వారు రాత్రికి రాత్రే సూపర్‌ స్టార్‌లుగా మారుతున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో చాలానే చూశాం. తాజాగా ఈ లిస్ట్‌లోకి ‘ఎమిలీ’ కూడా వచ్చి చేరింది. తన గానంతో నెటిజన్ల మనసు దోచుకుంటుంది ఎమిలీ. ఇంతకు ఎమిలీ ఎవరనేగా మీ అనుమానం.. గాడిద. అవును మీరు చదివింది కరెక్టే ఎమిలీ ఓ గాడిద. సాధరణంగా గొంతు బాగాలేకపోయినా పాటలు పాడుతూ.. ఇబ్బంది పెట్టే వారిని గార్దభ స్వరం(గాడిద గొంతు) అంటూ వెక్కిరిస్తాం. కానీ ఇక్కడ గాడిద గానమే వైరల్‌ కావడం విశేషం.

ఆ వివరాలు.. రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యం పాలైన ‘ఎమిలీ’ అనే ఆడ గాడిదను దాని యజమాని రోడ్డు మీద వదిలేసి వెళ్లాడు. దాంతో పుణెకు చెందిన ఓ జంతు సంరక్షణశాల యాజమాన్యం ఎమిలీని తీసుకెళ్లి.. చికిత్స చేసి కోలుకునేలా చేశారు. ఈ సంరక్షణశాలలో ఎమిలీతో పాటు పిల్లులు, కుక్కలు, దున్నపోతులు వంటి ఇతర జంతువులు కూడా చాలానే ఉన్నాయి. ఎమిలీకి సంతోషం కలిగినప్పుడు కూనిరాగాలు తీస్తుందట. ఇది విని మిగతా జంతువులు దాని చుట్టూ చేరి సంతోషంగా ఆడటం గమనించారు సిబ్బంది. దాంతో వారికి ఓ వినూత్న ఆలోచన వచ్చింది.

ఎప్పుడూ గాయపడిన జంతువుల గురించే వీడియోలు తీసి.. యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తాం. ఈ సారి వెరైటీగా ఎమిలీ కూనిరాగాలను వీడియో తీద్దామనుకున్నారు. అలానే చేసి ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. అయితే ఆశ్చర్యకరంగా ఈ వీడియో వైరల్‌ అయ్యిందంటున్నారు సదరు ఎన్జీవో ప్రతినిధులు. ఐర్లాండ్‌కు చెందిన హ్యారియేట్‌ అనే గాడిద కూడా ఇలానే ప్రచారం పొందిందని.. దాన్ని చూసే తాము ఇలా ప్రయత్నించామంటున్నారు ఎన్జీవో ప్రతినిధులు.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇంటి వద్ద కట్టేసి వచ్చాగా.. ఐనా పార్లమెంటుకొచ్చావా!

పెద్ద సూపర్‌ మార్కెట్‌.. ఎక్కడ చూసినా ఎలుకలే

వండుకుని తినేస్తా; పిచ్చి పట్టిందా ఏంటి?

వైరల్‌: రైల్వే ప్లాట్‌ఫాం మీదుగా ఆటో..!

నిన్ను రీసైకిల్‌ చేస్తాం

భయానక అనుభవం; హారర్‌ మూవీలా..

గోడలు లేని బాత్‌రూమ్‌: నెటిజన్ల మండిపాటు

ఐదేళ్ల పాప తెలివికి నెటిజన్లు ఫిదా..

వీడియో వైరల్‌..  రణ్‌వీర్‌పై ప్రశంసల జల్లు

ఎక్కడ చూసినా మొసళ్లే.. బిక్కుబిక్కుమంటూ జనం!

ఆ అనుబంధం కంటే గొప్పదేదీ లేదు : సీఎం

మోదీకి ఇజ్రాయెల్‌ ప్రధాని ట్వీట్‌; నెటిజన్లు ఫిదా..!

హనీమూన్‌: భర్తతో విహరిస్తున్న ఎంపీ!

తాగి.. జిరాఫీతో గేమ్స్‌.. తగిన శాస్తి జరిగింది!

ఎక్కువ ఫార్వర్డ్‌ చేస్తే వాట్సాప్‌ చెప్పేస్తుంది!

ముక్తేశ్వర ఘాట్‌లో మద్యపానం : వీడియో వైరల్‌

ఒక్క ఆలోచన.. వంద అవకాశాలు

ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ పిచ్చి: వైరల్‌

నాగపుష్పం కాదు.. అంతా ఉత్తిదే!

అక్కడ నవ్వడమా? సిగ్గుచేటు!

వైరల్‌ : విరుచుకుపడిన ‘సునామీ’ అలలు..!

మెల్లగా అనుసరిస్తూ.. మెరుపుదాడి..అంతలోనే!

ఆమె.. లేటెస్ట్‌ ఫేస్‌బుక్‌ సెన్సేషన్!

అతని పాటకు గాడిద గొంతు కలిపింది: వైరల్‌

అవ్వలా కనిపిస్తోంది‌.. ఆ నటికి ఏమైంది?

కూతురికి 'నైరా' అని పేరు పెట్టిన నటి!

‘కాఫీ డేలో ఎన్నెన్నో ప్రేమకథలు, మరెన్నో ఙ్ఞాప​కాలు’

ఆమె డ్యాన్స్‌ చూస్తే.. నిజంగానే పిచ్చెక్కుతుంది!!

ఇదేమీ బౌలింగ్‌ యాక‌్షన్‌ రా బాబు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

భవిష్యత్తు సూపర్‌ స్టార్‌ అతడే..!

ఎలాంటి వివాదాలు సృష్టించని సినిమా : వర్మ

నోరు జారారు.. బయటకు పంపారు

తమిళ అర్జున్‌ రెడ్డి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

అందుకే నన్ను అరెస్టు చేశారు: హీరోయిన్‌

‘ఇండియన్‌ 2’ ఇప్పట్లో రాదట!