వైరల్‌ వీడియో.. జర్నలిస్‌ వినూత్న ఆలోచన

22 Jul, 2020 16:56 IST|Sakshi

ఓ వైపు దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మాస్క్‌ ధరించడం, శానిటైజర్‌ వాడకం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనాను కట్టడి చేయగలమని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. కానీ మన జనాలు మాత్రం వీటిని చెవిన పెట్టడం లేదు. పని ఉన్నా లేకపోయినా రోడ్ల మీద తిరుగుతుంటారు. మాస్క్‌ ధరించారు. సామాజకి దూరం మాట దేవుడేరుగు. ఈ క్రమంలో కొందిరిలోనైనా మార్పు తీసుకురావడానికి ఓ జర్నలిస్ట్‌ వినూత్న ప్రయత్నం చేశాడు. మాస్క్‌ ధరించని మనుషులకు బుద్ధి చెప్పడం కోసం గాడిదను ఇంటర్వ్యూ చేశాడు. వినడానికి వింతగా ఉన్నా ఇది మాత్రం వాస్తవం. ప్రస్తుతం ఈ గాడిద ఇంటర్వ్యూ సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. నెటిజనులు సదరు జర్నలిస్ట్‌ ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు. ఆ వివరాలు.. (ఎఫ్‌బీ పోస్ట్‌; టిప్‌గా 32 వేల డాల‌ర్లు!)

ఈ వీడియోలో ఓ జర్నలిస్ట్‌ రోడ్డు మీద మాస్క్‌ లేకుండా తిరుగుతున్న జనాలకు బుద్ధి చెప్పాలని భావించాడు. ఈ క్రమంలో రోడ్డు మీద ఉన్న గాడిద మూతి దగ్గర మైక్‌ పెట్టి.. ‘మాస్క్‌ ధరించకుండా రోడ్డు మీదకు ఎందుకు వచ్చావు’ అని ప్రశ్నిస్తాడు. కానీ అది జంతువు కదా సమాధానం రాదు. దాంతో పక్కనే మాస్క్‌ ధరించకుండా వెళ్తోన్న ఓ మనిషిని ఆపి.. ‘మాస్క్‌ పెట్టుకోకుండా బయటకు వచ్చావేందుకు అని అడిగాను. కానీ సమాధానం చెప్పడం లేదు ఎందుకు’ అని అడుగుతాడు జర్నలిస్ట్‌. అందుకు ఆ వ్యక్తి ‘ఎందుకంటే అది గాడిద’ అంటాడు. వెంటనే జర్నలిస్ట్‌ ‘ఓహో గాడిద లాక్‌డౌన్‌ సమయంలో మాస్క్‌ పెట్టుకోకుండా రోడ్డు మీద తిరుగుతుంది. అంతే కదా’ అంటాడు. జర్నలిస్ట్‌ తనను గాడిదతో పోల్చాడని అర్థం చేసుకుని ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇలానే మాస్క్‌ లేకుండా రోడ్డు మీద తిరుగుతున్న మరి కొందరిని ప్రశ్నిస్తాడు. (చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పాడు..)

ఈ వీడియోను అరుణ్‌ బోత్రా అనే ఐపీఎస్‌ అధికారి తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడంతో తెగ వైరలవుతోంది. ‘లాక్‌డౌన్‌ సమయంలో బెస్ట్‌ మీడియా ఇంటర్వ్యూ’ అనే క్యాపన్ష్‌తో షేర్‌ చేసిన ఈ వీడియో తెగ వైరలవుతోది. చాలా బాగా బుద్ధి చెప్పాడని నెటిజనులు సదరు జర్నలిస్ట్‌ను ప్రశంసిస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు