వైరల్‌: బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. ఆడిపాడిన సాక్షి ధోని

19 Nov, 2018 20:41 IST|Sakshi

ముంబై: టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోని సతీమణి సాక్షి ధోని సోషల్‌ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తాజాగా తన బర్త్‌ డే వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ప్రతీ సారి తను షేర్‌ చేసే ఫోటోలో మిస్టర్‌ కూల్‌ ధోని లేక జీవా హైలెట్‌గా ఉండేవారు కానీ తాజాగా షేర్‌ చేసిన ఫోటోలు, వీడియోలో సాక్షి మాత్రమే హైలెట్‌గా నిలిచారు. ఆదివారం(నవంబర్‌ 18) ముంబైలో సాక్షి ధోని జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలో సాక్షి తన స్నేహితులతో కలిసి చిన్న పిల్లలా మారి ఆడుతూ, పాడుతూ తెగ అల్లరి చేశారు. ఈ కార్యక్రమానికి సాక్షి స్నేహితులతో పాటు పలువురు సినీ తారలు హాజరయ్యారు.

ధోని-పాండ్యాల బ్రొమాన్స్‌
సాక్షి ధోని బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ధోనితో కలిసి దిగిన ఫోటోను పాండ్యా షేర్‌ చేశాడు. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. ధోని, పాండ్యాల మధ్య బ్రొమాన్స్‌(రొమాన్స్ ఆఫ్ బ్రదర్స్) చూడముచ్చటగా ఉందని కామెంట్‌ చేస్తున్నారు. ఇక గాయం కారణంగా ఆస్ట్రేలియా సిరీస్‌కు పాండ్యా దూరం కాగా ధోనిని సెలక్టర్లు పక్కకు పెట్టిన విషయం తెలిసిందే.  

 


Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు