రాచనాగు వర్సెస్‌ కొండచిలువ

12 Nov, 2017 15:12 IST|Sakshi

బ్యాంకాక్‌ : పదిహేడు అడుగులు పొడవు కలిగిన కింగ్‌ కోబ్రా.. కొండచిలువను తన ఆహారంగా చేసుకుని మింగేసింది. ఈ ఘటన థాయ్‌లాండ్‌లోని ఓ రిసార్ట్‌కు చేరువలో చోటు చేసుకుంది. కేవలం ఐదే అడుగులు పొడవున్న కొండచిలువ తనను తాను కాపాడుకునేందుకు రాచనాగు తలను చుట్టేసినా ఫలితం లేకపోయింది.

పాముల మధ్య భీకర పోరును చూసిన స్థానికులు ఎమర్జెన్సీ సర్వీసెస్‌కు సమాచారం అందించగా.. వారు అక్కడికి చేరుకునేందుకు మూడు గంటల సమయం పట్టింది. ఈలోగా పదునైన పళ్లతో కొండచిలువ శరీరాన్ని రాచనాగు చీరేసింది. స్థానికులు పెద్ద ఎత్తున పాముల పోరాట స్థలం వద్దకు చేరుకోవడంతో అప్రమత్తమైన రాచనాగు అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. ఇంతలో అక్కడికి చేరుకున్న సంరక్షక బృందాలు రాచనాగును పట్టుకుని సంరక్షణ కేంద్రానికి తరలించాయి.  

మరిన్ని వార్తలు